కుట్రలకు చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్

Published : Nov 02, 2017, 05:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
కుట్రలకు చంద్రబాబే బ్రాండ్ అంబాసిడర్

సారాంశం

జగన్ పాదయాత్రలో విధ్వంసం సృష్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. జగన్ పాదయాత్ర అంటే చంద్రబాబు భయపడుతున్నాడని.. అందుకే ఎదరుదాడి చేస్తున్నాడని ఆమె విమర్శించారు

వైసీపీ అధ్యక్షుడు జగన్ పాదయాత్రలో విధ్వంసం సృష్టించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. చంద్రబాబుపై ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను ప్రజలతోపాటు, పోలీసులు కూడా తిప్పి కొట్టాలని ఆమె కోరారు. జగన్ ప్రజా సంకల్ప యాత్ర.. టీడీపీ అంతిమ యాత్రగా అభివర్ణించారు. జగన్ పాదయాత్ర అంటే చంద్రబాబు భయపడుతున్నాడని.. అందుకే ఎదరుదాడి చేస్తున్నాడని ఆమె విమర్శించారు.

కుట్రలు,.. కుతంత్రలు చేయడం చంద్రబాబుకి మొదటి నుంచి అలవాటేనన్నారు. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన ఘటన చంద్రబాబుదన్నారు. ఆయన నరనరాన కుట్రలు.. కుతంత్రాలు ఉన్నాయని రోజా విమర్శించారు.

తుని విధ్వంసం పని వైసీపీ నేతల పనేని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రోజా తిప్పికొట్టారు. తునిలో రైలు తగలబెట్టింది టీడీపీ నేతలనేని ఇంటిలిజెన్స్ రిపోర్టు ఇచ్చిందని ఆమె అన్నారు. ‘ఓటుకు నోటు’ కేసులో చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద సాగిలపడ్డారన్నారు. మోదీ, పవన్ కాళ్లు పట్టుకొని చంద్రబాబు గత ఎన్నికల్లో విజయం సాధించారని విమర్శించారు.

ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేసే హక్కు జగన్‌కు ఉందన్నారు. 50ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపేందుకు చేసిన కుట్రను వైసీపీ భగ్నం చేసిందన్నారు. అప్పట్లో అలాంటిదేమీలేదన్న చంద్రబాబు ...ఇప్పుడు ఇద్దరు ఉద్యోగులను ఎందుకు సస్పెండ్‌ చేశారంటూ ప్రశ్నించారు. తప్పులు చేయడం కేంద్రం కాళ్లు పట్టుకోవడం చంద్రబాబు నైజమన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !