టీడీపీలో మరో ఆదిపత్య పోరు

Published : Nov 02, 2017, 05:08 PM ISTUpdated : Mar 26, 2018, 12:04 AM IST
టీడీపీలో మరో ఆదిపత్య పోరు

సారాంశం

టీడీపీలో మరో ఆదిపత్య పోరు మొదలైంది.  ఓ పదవి కోసం మొదలైన పోరు.. చివరికి నేతలు బాహాటంగానే ఒకరినొకరు విమర్శించుకోనే దాకా చేరింది

టీడీపీలో మరో ఆదిపత్య పోరు మొదలైంది.  ఓ పదవి కోసం మొదలైన పోరు.. చివరికి నేతలు బాహాటంగానే ఒకరినొకరు విమర్శించుకోనే దాకా చేరింది. దీంతో చంద్రబాబుకి కొత్త తలనొప్పులు తయారయ్యాయి.

అసలు విషయం ఏమిటంటే.. గత కొద్ది రోజుల క్రితం కాకినాడ  కొర్పొరేషన్ కి ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో టీడీపీ విజయం సాధించింది. ఈ విజయానికి కృషి చేసిన వారిలో డిప్యుటీ సీఎం చినరాజప్ప, ఎమ్మెల్యే  వనమాడి కొండబాబులు కూడా ఉన్నారు. అయితే ఆ తర్వాత నుంచే ఇద్దరు నేతల మధ్య వివాదం మొదలైంది.

ఎమ్మెల్యే కొండబాబు.. తన వర్గానికి చెందిన మహిళకు మేయర్ పీఠం ఇవ్వాలని పట్టుపట్టారు. అయితే.. ఆమెకు కాకుండా మరోకరు మేయర్ పదవిని దక్కించుకున్నారు. దీంతో చినరాజప్ప వర్గీయుల కారణంగానే ఇలా జరిగిందంటూ కొండబాబు విమర్శలు చేయడం మొదలుపెట్టాడు.

ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో రాజప్ప తాను ప్రాథినిత్యం వహిస్తోన్న పెద్దాపురం నియోజకవర్గం నుంచి కాకుండా కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కొండబాబుపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, అందుకే గత కార్పొరేషన్ ఎన్నికల్లో కొండబాబు సోదరుడి కుమారుడు కూడా కార్పొరేటర్‌గా ఓడిపోయాడని చినరాజప్ప నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వివాదాలు కాస్తా పెద్దవి కావడంతో ఒకరినొకరు బహిరంగంగానే విమర్శించుకుంటున్నారు. నేడో రేపో.. ఈ వివాదం చంద్రబాబు దగ్గరకి కూడా వెళ్లే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !