పాదయాత్రకు ముందు జగన్ కి షాక్

First Published Nov 4, 2017, 11:02 AM IST
Highlights
  • వైసీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది.
  • రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిచుకున్నారు. ఆయన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ.. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జగన్ కి విజయ కంకణాన్ని కట్టారు. దీంతో.. ఆనందోత్సాహల మధ్య ఉన్న వైసీపీ నేతలకు ఊహించని షాక్ తగిలింది.

ఈ నెల 6వ తేదీ నుంచి జగన్.. ప్రజా సంకల్పయాత్ర మొదలౌతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. ఆయన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు.

రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఈరోజు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆమె టీడీపీలో చేరారు. ఆకర్ష్ పేరిట ఇప్పటికే వైసీపీకి చెందిన 21మంది ఎమ్మెల్యేలను లాక్కున్న టీడీపీ.. తాజాగా మరో ఎమ్మెల్యేను లాక్కున్నారు. ఇప్పటికే నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. రాజేశ్వరి టీడీపీలో చేరడం పట్ల.. వైసీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాదయాత్ర మొదలు కాకముందే ఆ పార్టీ ఎమ్మెల్యే ఇలా ఫిరాయింపుకు పాల్పడటం పట్ల తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటితో వలసలు ఆగలేదని.. ఇంకా చాలా మంది తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ టీడీపీ నేతలు చెప్పడం గమనార్హం.

గత ఎన్నికల్లో జ్యోతుల నెహ్రు మద్దతుతో రాజేశ్వరికి వైసీపీలో సీటు ఇచ్చారనే ప్రచారం ఉంది. దీంతో.. జ్యోతుల నెహ్రు ఏ రోజైతే టీడీపీలో చేరారో.. అదే రోజున రాజేశ్వరి కూడా చేరుతుందనే వార్తలు వెలువడ్డాయి. అయితే.. ఆమె వాటిని ఖండించారు. మరో రెండు నెలల నుంచి ఎమ్మెల్యే టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతుంది. నేడు అదే నిజమైంది.

click me!