వైఎస్ ని చూసి చంద్రబాబు కాపీ కొట్టాడు..

Published : Nov 06, 2017, 12:24 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
వైఎస్ ని చూసి చంద్రబాబు కాపీ కొట్టాడు..

సారాంశం

చంద్రబాబుని విమర్శించిన కొడాలి నాని వైఎస్ మహానుభావుడన్న నాని వైఎస్ ని చూసి చంద్రబాబు కాపీ కొట్టి పాదయాత్ర చేశాడని విమర్శించిన నాని

‘ పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందట’ అనే చందంగా పులిలాంటి వైఎస్ ని చూసి... నక్కలాంటి చంద్రబాబు పాదయాత్ర చేశాడని వైసీపీ నేత కొడాలి నాని అన్నారు. సోమవారం ఉదయం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కొడాలి నాని మాట్లాడారు.

ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభ కార్యక్రమానికి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రజలకు వైఎస్‌ఆర్‌ సీపీ నేత కొడాలి నాని ధన్యవాదాలు తెలిపారు.  పాదయాత్ర అనగానే అందరికీ వైఎస్ గుర్తుకు వస్తారని చెప్పారు. ఆ తండ్రికి తగిన తనయుడు జగన్ అన్నారు.

అనేక మందిని విద్యార్థులను చదివించిన గొప్ప వ్యక్తి వైఎస్‌ అన్నారు. రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి.. విద్యుత్‌ బకాయిలను రద్దు చేశారని గుర్తు చేశారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో సైతం పేదలు చికిత్స పొందేలా చేసిన ఘనత వైఎస్ ది అని అన్నారు.  ఆయన్న చూసి పాదయాత్ర చేసిన బాబు.. పగలంతా బస్సులో పడుకుని రాత్రి దొంగలాగా పాదయాత్ర చేశాడని విమర్శించారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !