
ప్రజల్లో నమ్మకాన్ని నింపేందుకే తాను ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నట్లు.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఆయన ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా అతనితో ముచ్చటించింది. ఈ పాదయాత్ర చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకుంది.
జగన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్ధపు హామీలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తాను మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. ఈ మూడున్నరేళ్ల కాలంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయానని చెప్పారు. యువత ఉపాధి లేక నిరాశ, నిస్పృహలకు లోనయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. జగన్ సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సాఆర్ ఘాట్ వద్ద కుటుంబసభ్యులతో నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో పాటు పలువురు నేతలు వెంటరాగా ఘాట్ నుండే సరిగ్గా 9.47 నిముషాలకు పాదయాత్రను జగన్ ప్రారంభించారు.