జగ్గయ్యపేట మున్సిపాలిటిలో వైసీపీ జెండా.. టీడీపీకి షాక్(వీడియో)

First Published Oct 28, 2017, 1:11 PM IST
Highlights
  • జగ్గయ్యపేట మున్సిపల్ ఎన్నిక ఏకగ్రీవం
  • ఛైర్మన్ గా ఎన్నికైన వైసీపీ నేత రాజగోపాల్

రాజధాని జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. అమరాతికి కూతవేటు దూరంలోగల జగ్గయ్యపేటలో ప్రతిపక్ష పార్టీ జెండా ఎగుర వేసింది. జగ్గయ్య పేట మున్సిపల్ కార్పొరేషన్ని వైసీపీ కైవసం చేసుకుంది. ఆ మున్సిపాలిటీని సొంతం చేసుకోవడానికి టీడీపీ సాయశక్తులా ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. టీడీపీ ప్రలోభాలకు వైసీపీ తలొగ్గలేదు. దీంతో వాకౌట్ ముసుగులో మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిని వైసీపీకి వదిలేసింది.

అనేక నాటకీయ పరిణామాల అనంతరం జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ముగిసింది. వైసీపీ నేత ఇంటూరి రాజగోపాల్ శనివారం మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజగోపాల్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైసీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు ఒకటి ఉన్నారు. చైర్మన్ ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. అయితే ఎన్నిక వాయిదాకు ససేమిరా అనడంతో టీడీపీ సభ్యులు వాకౌట్‌ చేశారు. వైసీపీ నేతల సమక్షంలో ఇంటూరి రాజగోపాల్‌ ప్రమాణం చేశారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో ఛైర్మన్ ఎన్నిక నిన్న వాయిదా పడింది. టీడీపీ నేతల దౌర్జన్యంతో మున్సిపల్ కార్యాలయం వద్ద శుక్రవారం ఉద్రికత్తత నెలకొంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు అక్కడ  144 సెక్షన్ విధించిన సంగతి తెలిసిందే.

 

click me!