నారాయణ, చైతన్యల మధ్య విభేదాలు

Published : Oct 28, 2017, 12:35 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
నారాయణ, చైతన్యల మధ్య విభేదాలు

సారాంశం

చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన నారాయణ, చైతన్య రాజుల మధ్య విభేదాలు మొదలయ్యాయా? ఉన్న సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకి వీరిద్దరూ కొత్త తలనొప్పులు తెస్తారా?అనే ప్రశ్నలు ప్రస్తుతం టీడీపీ నేతల బుర్రలను తొలిచేస్తున్నాయి.

చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైన నారాయణ, చైతన్య రాజుల మధ్య విభేదాలు మొదలయ్యాయా? నిన్నటి వరకు సన్నిహితంగా ఉన్న వీరి మధ్య అకస్మాత్తుగా విభేదాలు ఎందుకు వచ్చాయి? రాజకీయంగా ఇవి ఎటువైపు దారి తీస్తాయి..? ఉన్న సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబుకి వీరిద్దరూ కొత్త తలనొప్పులు తెస్తారా?అనే ప్రశ్నలు ప్రస్తుతం టీడీపీ నేతల బుర్రలను తొలిచేస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే.. నారాయణ, చైతన్యరాజు.. పరిచయం అక్కర్లేని పేర్లు. వీరిద్దరూ కార్పొరేట్ విద్యా సంస్థల అధినేతలే. అసలు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించింది వీరే అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. తాజాగా వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదాలు  రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. చైతన్య రాజుకి మొదటి నుంచి రాజకీయాలతో ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్నాయి. కానీ.. నారాయణకు లేదు. ఆయన కేవలం చంద్రబాబుకి సన్నిహితంగా ఉండేవారు. నారాయణ రాజకీయాల్లోకి రాకముందు..ఈ రెండు విద్యా సంస్థల మధ్య పోటాపోటీ ఉన్నప్పటికీ.. రాజకీయంగా వారిద్దరికీ సమస్యలు లేవు.కానీ.. చంద్రబాబు పుణ్యమానీ నారాయణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.

ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న చైతన్య రాజు.. టీడీపీలోకి ఫిరాయించాడు. దాంతో ఇద్దరూ ఒకే పార్టీ గూటి కిందుకు చేరిపోయారు. వ్యాపారంలోనూ ఇద్దరినీ కలిపి పార్టీ నేతలు పుణ్యం కట్టుకున్నారు. నారాయణ, చైతన్య విద్యా సంస్థలు ఒక్కటై ‘చైనా’గా గుర్తింపు తెచ్చుకున్నాయి. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో ఇప్పుడు వీరిద్దరి మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తాయి. నెల్లూరుకి చెందిన ఓ పదోతరగతి విద్యార్థి  విషయంలో వివాదం తలెత్తింది. నారాయణలో చదువుతున్న పిల్లవాడిని..చైతన్య సంస్థ వాళ్లు.. కిడ్నాప్ చేసినంత పనిచేసి మరీ హైదరాబాద్ కి తీసుకు వెళ్లిపోయారు. నారాయణ వాళ్లు పిల్లవాడి కోసం వాకబ్ చేయగా.. చైతన్య వాళ్లు తీసుకువెళ్లినట్లు తెలిసింది. దీంతో వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం పోలీసు స్టేషన్ కి వెళ్లేదాకా దారి తీసింది. ఇప్పుడు ఈ రెండు సంస్థల భాగస్వామ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతంలోనూ మంచి ర్యాంకు సాధించిన విద్యార్థుల పేరెంట్స్ కి డబ్బు ఇచ్చి.. వాళ్లు తమ విద్యా సంస్థలోనే కోచింగ్ తీసుకున్నారని చెప్పించారని ఈ రెండు సంస్థలపై ఆరోపణలు ఉన్నాయి.

అయితే.. వీరిద్దరూ విడిపితే ఎక్కువ నష్టపోయేది చంద్రబాబే. చైతన్య రాజు పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తి. అంతేకాక క్షత్రియ కులానికి చెందినవాడు. ఇక నారాయణ నెల్లూరు జిల్లా... కాపు వర్గానికి చెందిన వ్యక్తి. వీరిద్దరి సామాజిక వర్గాల ఓట్లు గత ఎన్నికల్లో టీడీపీకే పడ్డాయి. పశ్చిమ గోదావరిజిల్లాలో ని 15నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగురవేసింది. ఇప్పుడు వీరిద్ధరి మధ్య తలెత్తిన విభేదాలు సామాజిక పరంగా పార్టీకి నష్టం కలిగిస్తాయోమనని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడి దాకా దారి తీస్తుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !