కాంగ్రెస్ , వైసిపి రాజీ పనిలో ప్రశాంత్ కిశోర్

First Published Jul 13, 2017, 1:14 PM IST
Highlights
  • తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ లను రాజీ చేసే పనిలో ప్రశాంత కిశోర్
  • జగన్ ప్రకటించిన 9హామీలు నవరత్నాలు కాదు, గులక రాళ్లు
  • అవి తగుల్తాయని జగన్ చూసి ప్రజలు భయపడ్తున్నారు

ప్రతిపక్షనాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సలహాదారుగా ప్రశాంత్  కిశోర్ పనేమిటి? దీని వెనక రాజకీయ వ్యూహమేదయినా ఉందా? ఉందంటున్నారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు.

ఎన్నికల్లోగెలిచేందుకు ప్రతిపక్ష పార్టీ ప్రశాంత కిశోర్ ముందపెట్టుకోవడాన్ని ఎద్దేవా చేస్తూ,తల్లి కాంగ్రెస్  పిల్ల కాంగ్రెస్ ల మధ్య రాజీకే ప్రశాంత్ కిషోర్ కన్సల్టెన్సీఅని ఆయన అన్నారు. ‘ప్రశాంత్ కిశోర్  ను రాహుల్ వాడుకున్నాడు, తల్లి కాంగ్రెస్ భూస్థాపితం అయ్యింది, ఇప్పుడు జగన్ తెచ్చుకున్నాడు, ఇక పిల్ల కాంగ్రెస్ కూడా భూస్థాపితమే,’ అని అన్నారు.

నియోజకవర్గాల పెంపును రాహుల్ వ్యతిరేకించడం కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకు చేస్తున్న మరో ద్రోహం అని  ఆర్ధికమంత్రి వ్యాఖ్యానించారు.అసమాన విభజన ద్వారా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కు మహా ద్రోహం చేశారని ఇపుడు నియోజకవర్గాల పెంపును వ్యతిరేకించి మరొక సారి ద్రోహం చేస్తున్నారని ఆయన అన్నారు. 

‘‘ఆర్ధికంగా,భౌగోళికంగా ఇప్పటికే రాష్ట్రానికి రాహుల్ ద్రోహం చేశారు.నియోజకవర్గాల పెంపును వ్యతిరేకించడం ద్వారా రాహుల్ రాజకీయ, సామాజిక ద్రోహానికి తెగబడ్డారు. 2019 ఎన్నికలతో రాష్ట్రానికి,దేశానికి పట్టిన చీడపీడలు పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ వదిలిపోతాయి,’’ అని   రామకృష్ణుడు అన్నారు.

ప్లీనరీలో  వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత ప్రటించిన తొమ్మిది హామీలు నవరత్నాలు కాదు, 9 గులక రాళ్లు అని  ఆర్ధికమంత్రి యనమల వ్యాఖ్యానించారు.జనం నిజంగా ఈ గులకరాళ్ల తమకు తగుల్తాయని భయపడుతున్పనారని అంటూ  ఎందుకంటే అవి  వైకాపా విధ్వంసక ధోరణికి సాక్ష్యం  అని తన సహజ వ్యంగ్య దోరణిలో యనమల  అన్నారు.

 

click me!