చంద్రబాబు సోషల్ మీడియా సైన్యం వస్తా ఉంది, కాచుకోండి

First Published Jul 13, 2017, 9:44 AM IST
Highlights
  • టిడిపి ప్రభుత్వం సోషల్ మీడియాలో బాగా వెనకబడి ఉంది.
  • వైఎస్ ఆర్ కాంగ్రెస్ దే పైచేయి గా ఉంది
  • ప్రభుత్వ ఇమేజ్ పెంచేందుకు సోషల్ మీడియా సైన్యాన్ని ప్రయోగించాలని చంద్రబాబు నిర్ణయం
  • సైన్యం నిర్వహించే బాధ్యత ఆర్థిక మంత్రి యనమలకు

తెలుగుదేశం ప్రభుత్వం సోషల్ మీడియాలో బాగా వెనకబడి ఉందన్న విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తించారు. వచ్చే సోమవారం నుంచి సోషల్ మీడియాతో  ప్రభుత్వ కార్యక్రమాల సుడిగాలి సృష్టించాలని  ఆయన మంత్రులను, అధికారులను ఆదేశించారు. దీనికోసం సోషల్ మీడియా సైన్యం రూపొందిస్తారు. వారు సోషల్ మీడియా ఆధారంగా గత మూడేళ్లలో ప్రభుత్వం మీద పడిన బురదను తుడిచేసి  శుభ్రంగా  తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రజల ముందు నిలబెట్టేందుకు చర్యలు తీసుకుంటారు. 

సోషల్ మీడియా సైన్యం కమాండర్ బాధ్యతను అర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి అప్పగించారు. ప్రతి సోమవారం ఆర్థిక మంత్రి నిర్వహించే సంక్షేమ శాఖల  సమీక్షా సమావేశాలలో సోషల్ మీడియా టీం కూడా పాల్గొంటుంది. సోషల్ మీడియా సలహాదారు సోహైల్ తప్పనిసరిగా ఈ సమావేశాలలో పాల్గొంటారు.

సోషల్ మీడియా క్యాంపెయిన్ ప్రతిపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ ది పైచేయి కావడంతో, వచ్చే రెండేళ్లో ప్రభుత్వ ప్రచారానికి సోషల్ మీడియాను ప్రధానంగా వాడాలని నిర్ణయించారు.  ప్రతిపక్ష దాడిని తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాలోచొరబడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారని తెలిసింది.ఇప్పటివరకు ప్రతిపక్ష విమర్శలకు సమాధానం చెప్పేందుకే  ముఖ్యమంత్రి కార్యాలయంలో సోషల్‌ మీడియా పనిచేస్తున్నది. ఇది చాలదని,  ఇకపై ఆ సేవలను సంక్షేమ పథకాల ప్రచారంలో కూడా వినియోగిరచుకోవాలని నిర్ణయించారు. సోషల్‌ మీడియా విభాగాన్ని మరిరత బలోపేతం చేసేరదుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఇక నుంచి  ప్రతిసోమవారం యనమల 12 విభాగాల సంక్షేమ పథకాల అమలు తీరు ను సమీక్షిస్తారు. ఇందులో  బిసి సంక్షేమశాఖ, సాంఘిక, మైనార్టీ సంక్షేమ శాఖలు, మహిళా, శిశు, వికలాంగ, వృద్ధుల సంక్షేమ అధికారులు పాల్గొంటారు.

పేదలకు కావాల్సిన నిత్యావసర సౌకర్యాలపైనా దృష్టి సారిరచేందుకు హౌసింగ్‌, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి, కుటుంబ సంక్షేమం, పాఠశాల విద్య, యువజన సంక్షేమం, బ్రాహ్మణ కార్పొరేషన్‌, కాపు కార్పొరేషన్‌ అధికారులను కూడా ఇందులో భాగస్వాములు చేస్తున్నారు.  ఈ సమీక్షల్లో ఎమ్మెల్సీ వివివి చౌదరి, సలహాదారు పరకాల ప్రభాకర్‌, తెలుగుదేశం పార్టీ నేత మలయాద్రి, ముఖ్యమంత్రి కార్యాలయంలోని సోషల్‌ మీడియా ప్రతినిధి సొహైల్‌లు కూడా తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు.

click me!