శశికళకు జైల్లో స్పెషల్ కిచెన్, లంచం రెండు కోట్లు

First Published Jul 13, 2017, 12:52 PM IST
Highlights
  • బెంగుళూరు సెంట్రల్ జైల్లో శశికళకు ప్రత్యేకంగా కిచెన్
  • కిచెన్ ఏర్పాటు అనుమతి కోసం రెండు కోట్ల రుపాయల లంచం
  • లంచం భుజించిన వారిలో ఏకంగా జైళ్ల శాఖ డిజిపి కూడా ఉన్నారు.

కొత్తగా బాధ్యతలు చేపట్టిన కర్నాటక జైళ్ల శాఖ  డిఐజి డి రూపా తీగెలాగింది. అంతే జైళ్లశాఖంతా కదిలింది.  కొత్తగా వచ్చింది కాబట్టి  పాత ఫైళ్లు తిరిగేస్తూ ఆమె కాలక్షేపం చేయాలనుకోలే. జైల్లో రెండు రౌండ్లేసి అక్కడ ఎం జరుగుతున్నది. ఖైదీలేంజేసున్నారు, ఏంతింటున్నారు, ఏం వండున్నతున్నారు, ఆఫీసర్లు ఏం దండుకుంటున్నారో చూడాలనుకుంది. అనుకున్నట్లే జూలై 10న పరప్పన అగ్రహార జైలు చూసింది, ఆశ్చర్యపోయింది.

తమిళనాడు ఎఐఎడిఎంకె నాయకులరాలు శశికళ తిష్టేవేసిన బెంగుళూరు సెంట్రల్ జైల్లో ఆమె కోసం ప్రత్యేకంగా ఒక వంటిల్లు తయారయిందని కనుకున్నారు. అంతేకాదు, దీన్ని నడిపేందుకు ఏకంగా రెండు కోట్ల రుపాయల లంచం అందరికి పంచారని కూడా కనుక్కున్నారు. ఇలా శశికళకు దొరుకుతున్న వివిఐపి ట్రీట్ మెంట్ చూసి రూప కళ్లు దిరిగిపోలేదు. అసలు విషయం తెలుసుకున్నాక ఆమె  కళ్లు  తిరిగాయి. ఈ రెండుకోట్లు ముడుపుల స్వీకరించిన వారి లో జైళ్ల శాఖ డిజిపి సత్యనారాయణ రావు కూడా ఉండటంతో ఆమెకు కళ్లు తిరిగాయి. దీనిమీద ఒక నివేదిక తయారు చేసి చర్యలు తీసుకోవాలని ఏకంగాసత్యనారాయణ రావుకే అందించింది. అంతేకాదు, ‘సార్, రెండు కోట్ల మింగేసిన వారిలో తమరి పేరుకు ఉందని జైలంతా కోడై కూస్తున్నదని  ఇది చాలా దురదృష్టకరమ’ మని కూడ అన్నారు (రూపా ఫోటోపైన)

 

అంతటి ఆగ లేదు, ఇదంతా మీకు తెలిసిన జరగనీయడం ఏమీ బాగాలేదని పుండు మీద కారం కూడా చల్లింది.

 

జైళ్లలో ఇలా రాజసం వెలగబెట్టిన వారిలో స్టాంపుల కుంభకోణం నిందితుడు తెల్గీ కూడా ఉన్నాడు. అతగాడికి జైలు అధికారులు మసాజ్ చేసేందుకు నలుగురు మనుషులనుకూడా అరేంజ్ చేశారు. మొదట్లో ఆరోగ్యం బాగా లేనపుడు కోర్టు సూచనల మేరకు ఇలా చేసిన, తర్వాత అధికారులు దానిని కంటిన్యూ చేయడం వెనకకూడా ముడుపులున్నాయట.

click me!