సినిమా రివ్యూ రాయడమంటే ‘అర్జున్ రెడ్డి’ తీసినంత ‘వీజీ’ కాదు

Published : Sep 05, 2017, 12:47 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
సినిమా రివ్యూ రాయడమంటే ‘అర్జున్ రెడ్డి’ తీసినంత ‘వీజీ’ కాదు

సారాంశం

లిబరల్ గా ముద్దులు, మందు బాటిళ్ళు,డ్రగ్స్,సిగరెట్లు-కొన్ని పచ్చి డైలాగులు, వెచ్చటి సీన్లు, మధ్య ఓ డాక్టర్ విఫల(!?) ప్రేమకథ, బాగ దంచి పొడిచేసి ఒక సీసాలో వేసి "అర్జున్ రెడ్డి" పేరు పెట్టారు.

ఈ సినిమా విడుదలకు ముందే వర్మ-వి.హనుమంత రావ్ ల మధ్య ముద్దు వివాదం (సారీ!వాళ్ళిద్దరి మధ్య కాదు-సినిమాలో ముద్దుల గురించి) వల్ల ఆసక్తిని రేకెత్తించింది..దానికి తోడు టిజర్లో సినిమా హీరో విజయ్ పలికిన పచ్చి బూతొకటి, టీవీల్లొ చర్చలు, దర్షకుడు సందీప్ రెడ్డి(!) బోల్డ్ ఇంటర్వ్యూలు..ఇలా సినిమా మీద ఆసక్తి పెరుగుతూ పోయింది. విడుదల తర్వాత మహేశ్ బాబు వంటి ప్రముఖ తెలుగు హీరో తొ పాటు ఆమిర్ ఖాన్(తెలుగు రాదు కాబట్టి డైలాగులు అర్థం కాక పోయి ఉండొచ్చు) వంటి వారు సినిమాను ప్రశంసించటం వల్ల కూడా సినిమా పట్ల ఆసక్తి పెరిగింది
    కథేంటంటే.. అర్జున్ రెడ్డి మంగళూర్(ఏం కాలేజి?) లోని ఓ మెడికల్ కాలేజ్ లో హౌస్ సర్జన్. అక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ప్రీతి (శాలిని- అమ్మాయి  బావుంది- బాచేసింది కూడా) ని చూసి, కాలేజ్ వదిలేసి వెళ్ళాలన్న(అప్పటికే అతన్ని కాలేజ్ లోంచి తీసేసి ఉంటారు) నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగుర్చి(మనం నిట్టూర్చి-సీట్లోనే ఉంటాం) ముందుకు సా...గుతుంది(అందుకే మూడు గంటల పై సినిమా అయ్యింది) తర్వాత షరా మాములే- అమ్మయి తండ్రి "నో" అంటాడు. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అమ్మయి కి పెళ్ళి(మరొకరితో) అయిపోతుంది.. హీరో మందు-సిగరెట్(బీడి కూడా)-డ్రగ్స్-వంటి వ్యసనాలకు బానిసౌతాడు..మధ్య మధ్యలో మందు తాగి ఆపరేషన్లు చేస్తుంతాడు..ఇదీ సగం కథ! మిగతా సగంలో పెద్ద కథేం లేదు.. పైవన్ని ఎక్కువౌతాయి  వంతే. చివరికి ఏం జరిగిందో మిగతా కథ.

    రివ్యూ రాయటం సులభం. సినిమా తీయటం కష్టం. నిజమే. అయితే సినిమాను 
ఎలా పడితే అలా తీయటం రివ్యూ రాసినంత సులభ కాకపోయినా కొంచెం సులభమే! బోల్డ్ (నిజంగానే) గా తీసిన ఈ సినిమా చాలా చోట్ల కొంచెం, కొన్ని చోట్ల చాలా శృతిమించింది.. డైలాగులు సహజంగానే ఉన్నయ్. ఎంత సహజంగానో వింటే తప్ప అర్థం కాదు). ఈ సినిమా యూత్ కి తప్పకుండా తప్పుడు సంకేతాలు పంపించే అవకాశం ఉంది. ఒకట్రెండు ఇక్కడ ప్రస్తావనార్హం. ఒక మెడికల్ కాలేజ్ లో యదేచ్చగా సిగరెట్లు, మందు తాగటం, ఒక ఫస్ట్ ఇయర్ అమ్మాయిని ఎంత హౌస్ సర్జన్ అయినా తన వెంట(అదీ క్లాస్ లో నుంచి) తీసుకెళ్ళి ప్రత్యేకంగా పాఠాలు చెప్పటం.. అదీ మన దేశంలోని మంగళూర్లో!  సినిమాలో ముద్దులు హద్దు మీరాయి. ఒక దశలో హీరో-హీరోయిన్లు కలిసినప్పుడల్లా(బాధైనా-సంతోషమైనా)ఇక ముద్దు పెట్టుకుంటారేమో ముద్దుల గురించి పెద్దా,పిన్నా అందరు ఎదురుచూశారు! ఒకరు భయంతో, మరొకరు ఉత్సాహంతో!! హాలివుడ్ సినిమాల్లో  కూడా ఇన్నేసి ముద్దులుండవేమో! నిజానికి ప్రేమను ఇంత బోల్డ్ గా(అదీ అన్నిసార్లు) ఎక్స్ ప్రెస్ చెయ్యటం అవసరమా అన్నది ప్రశ్న. 

ప్రీమెరైటల్ సెక్స్ ఒక చర్చనీయంశమైనప్పటికి దాన్ని రిపీటెడ్ గా చూపించటం అవసరమా? ఇక హీరొ మందు తాగే సన్నివేశాలు ఎక్కువుండటం కూడా అవసరం లేదేమో. మందు వల్ల కలిగే దుష్పరిమాణాలను స్పష్టంగా చెప్పటానికి హీరో మందు తాగే సన్నివేశాలు అన్ని ఉండాలా? ఒక దశలో హీరో డాక్టర్ కాకుండా మందు మీద రీసెర్చ్ చేసే వాడిలా అనిపించేంతగా ఉన్నాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయ్. వీటిల్లో అల్టిమేట్ ఏంటంటే ఒకానొక పెద్ద హాస్పిటల్లో  ఒక సర్జన్ మందు తాగి 300(!) పై చిలుకు ఆపరేషన్లు చేయటం. అదీ అందరికి తెలిసి. మెడికల్ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి.. ఇంకొకరి బ్రష్ (ఎంత ప్రేమ ఉన్నా సరే) వాడకూడదని తెలియక పోవటం విడ్డూరమే!

హీరో క్యారక్టరైజేషన్ మొదట్లో కొంచెం బాగానే అనిపించినా తర్వాత బాగా చెడిపోయింది(నిజంగా కూడా చెడిపోయింది). ఫ్రెండ్ కి బావ కాబొయే వ్యక్తి ఆడాళ్ళ గురించి కొంచెం అసభ్యంగా వర్ణిస్తుంటే ఆడవాళ్ళని "ఆబ్జెక్టిఫై" (వస్తువులాగ) లా భావిస్తున్నావని తిట్టిన హీరో ఆడాళ్ళపట్ల ఎంత మర్యాదగా వ్యవహరించాడు?? ఇక్కడే పాత్ర హుందాతనం పోయింది.  దీనికి రుజువుగా కొన్ని సీన్లున్నాయి. హీరో పాత్ర తీర్చిదిద్దటంలో మరింత శ్రద్ధ వహించి ఉంటే బావుండేది. హీరో పాత్ర ఇలా మొండిగా ఉండాలన్న విషయంలో దర్శకుడికి క్లారిటీ ఉందనిపిస్తుంది.కాని సినిమలో ఏం చెప్పాలన్నదానిమీద మాత్రం అంత క్లారిటీ ఉందనిపించదు.

లాజిక్ తక్కువ. రఫ్ నెస్ ఎక్కువున్న ఈ సినిమాలో  బావున్న అంశాలు బాగానే (అంటే ఎక్కువే) ఉన్నాయి. విజయ్ దేవరకొండ నటుడిగా దాదాపు విశ్వరూపం చూపించాడు. ఈ సారి అతనికి  ఒకటో అరో అవార్డ్ లు వచ్చిన ఆశ్చర్యం లేదు. షాలిని ఈ సినిమా కు సేవింగ్ గ్రేస్ (అంటే కాపాడే, హాయి గొలిపే). ఇంకా మెడికల్ కాలేజ్ సీన్లు, లొకేషన్లు కంటికింపుగా ఉన్నాయ్. దర్శకుడు విషయం ఉన్నవాడు కొండకచో బ్రిలియంట్ అనదగ్గ సీన్లూ ఉన్నాయి. హీరో నాయనమ్మ చనిపోయిన సీన్ దర్శకుడి టాలెంట్ కు సూచిక. ఈ సీన్లో విజయ్ నటన హైలైట్! ఇంకా హీరో ఫ్రెండ్ గా వేసిన రాహుల్ చాల సహజంగా చేశాడు. అతని వల్ల కూడా ఈ సినిమా ఆడొచ్చు(చూడొచ్చు). 3 గంటల సినిమాలో పండిన అంశాలు ఇవి. మరొక హాయిగొలిపే అంశం పా తతరం అందాల నటి కాంచన  (హీరో నాయనమ్మ పాత్రలో). ఈ వయసులో కూడా అందం(హుందాతనం)  అభినయం తగ్గలేదనిపించింది.

ఈ సినిమా పూర్తిగా బాలేదని చెప్పటం అన్యాయమౌతుంది. దర్శకుడు కొత్తవాడు, వయసున్నవాడు కావటం మూలాన కొంత కొత్తదనం, చిలిపితనం, కొన్ని పొరపాట్లు, కొంత ఇమ్మెచ్యూరిటి ఆమోదయోగ్యం. కాని ఈ సినిమాలో రా(అంటే పండని) విషయాలు కొంచెం ఎక్కువ. అదే ఇబ్బంది..దర్శకుడు పచ్చి డైలాగుల్ని కొంత పండించి, సీన్లు కొంచెం కత్తిరించి, మరికొన్ని సీన్లు క్షవరం(అనగా ట్రిం చేసి) ఉండిఉంటే ఇది ఇంకొంత మంచి, కుటుంబంతో సహా చూడదగ్గ "గేం చేంజర్" అయ్యుండేదేమో. మెడికల్ కాలేజ్ లో చదువుతున్న అమ్మాయికి.. ఇంకొకరి బ్రష్ (ఎంత ప్రేమ ఉన్నా సరే) వాడకూడని తెలియక పోవటం విడ్డూరమే!

సినిమాలు తీయటం కష్టం..విమర్శించటం సులువు.. నిజమే! సినిమాల ద్వారా సందేశాలు ఇవ్వకపోయినా ఫర్వాలేదు.. రాంగ్ సిగ్నల్స్ పంపించకపోతే చాలు. సినిమా డబ్బుతో కూడుకున్న కళాత్మక వ్యాపారం కావొచ్చు. ఎవరెలా సినిమా తీయాలన్నది వారి వారి ఇష్టం కావొచ్చు..కాని మనమొక సభ్య సమాజంలో ఉన్నామన్నది గమనించాలి, సినిమాలు తీసేవాళ్ళూ. . ఈ సందర్భంగా ఒక విషయం ప్రస్తావించాలి. అమితాబ్ బచ్చన్, సచిన్ లాంటి వాళ్ళు ఎంత ఆఫర్ ఇచ్చినా "మందు", "సిగరెట్" తయారి సంస్థల ప్రకటనలకు 'నో" చెప్పారు. సినిమా నిర్మాతలు, దర్శకులు ఇది గమనించాలి. సినిమా ఒకరకంగా శక్తివంతమైన మాధ్యమం. అందుకే ఎవరికి వారికి "సెల్ఫ్ రిస్ట్రైంట్" (స్వీయ నియంత్రణ) ఉండాలి.

ఈ సినిమా కు నిర్మాతలుగా దర్శకుడి కుటుంబసభ్యులు ఉన్నారు. మరి వారంత కలిసి సినిమా 
చూశారా ? విజయ్ ని "నువ్వు నాలానే ఉన్నావ్" అని రాం గోపాల్ వర్మ చెప్పాడని  వార్త. అది విజయ్     పాత్ర గురించైతే నిజమే చెప్పాడు! 

ముక్తాయింపు: ఈ మధ్య వచ్చిన ఒక తెలుగు సిన్మాలో హీరొ పాత్ర తరచు ఒక మాట అంటు ఉంటుంది.     "సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు?" . అదీ విషయం!

 

        *(ఈ రచయిత కొంటె కథలూ కాకరకాయలు రాసే కర్నూలు వాసి. స్పోర్ట్స్ జర్నలిజాన్ని పురిట్లోని వదిలేసి చాన్నాళ్లయింది. ఇపుడేమో పర్సనాలిటి డెవెలప్ మెంటు అంటూ తెగ ఉపన్యాసాలిస్తూ, పర్వాలేదు,                     బాగానే సంపాయిస్తున్నాడు. కనిపించినోళ్లకంతా హోమియో వైద్యం ఉచితంగా చేస్తాడు. ఫోటో మరొకసారెపుడైనా అచ్చేస్తాం.మాట్లాడాలనుకుంటే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి 9393737937)

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !