తెలుగోడి చేతిలో..  భారత్ ‘ ఆస్కార్  కల

Published : Sep 05, 2017, 12:09 PM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
తెలుగోడి చేతిలో..  భారత్ ‘ ఆస్కార్  కల

సారాంశం

దర్శకుడు, నిర్మాత సీవీ రెడ్డి.. ఈ జ్యూరీ కి ఛైర్మన్ గా ఎంపికయ్యారు .60ఏళ్ల ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చరిత్రలో ఒక తెలుగు వాడు ఇంతటి గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి.

ఈ సంవత్సరం... మన భారతీయ సినిమా ఒక్కటైనా ఆస్కార్ గెలుచుకుంటే బాగుండు.. సగటు సినీ అభిమాని, సినీ పరిశ్రమకు చెందినవారందరూ కోరుకుంటారు. ఏదైనా సినిమాకి గానీ, సినిమాలో నటించిన నటీనటులకు గానీ ఆస్కార్ అవార్డు వచ్చిందంటే.. చాలా గొప్పగా ఫీలవుతాం. అంతకన్నా గొప్ప అవార్డు ఇంకేమీ లేదు కూడా. అంత ప్రాముఖ్యత ఉంది అస్కార్ అవార్డుకి.అయితే.. దాదాపు ఆస్కార్ అవార్డులన్నీ హాలీవుడ్ సినిమాలకు, నటులకు వస్తుంటాయి. మన దేశ సినిమాలకు వచ్చింది చాలా తక్కువనే చెప్పవచ్చు. ప్రతి సంవత్సరం అడపా దడపా మన సినిమాలు నామినేషన్ల వరకు వెళుతున్నవీ ఉన్నాయి.

అయితే..మన దేశం నుంచి ఏదైనా సినిమా ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలపడాలంటే.. దానిని ఎవరో ఒకరు వాటిని ఎంపిక చేయాలి. మొదట వారు ఎంపిక చేస్తేనే.. అవి నామినేషన్ల వరకు వెళతాయి. ఇక నుంచి ప్రతి ఇండియన్ సినిమా ఆస్కార్ బరిలో నిలవడం నిలవకపోవడం మన తెలుగు దర్శకుడి చేతిలో ఆధారపడనుంది.

ప్రముఖ తెలుగు దర్శకుడు, నిర్మాత సీవీ రెడ్డి.. ఈ జ్యూరీ కి ఛైర్మన్ గా ఎంపికయ్యారు. బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ క్యాటగిరీకి ఆయన ఛైర్మన్ గా వ్యవహరించనున్నారు. ఆస్కార్ బరిలో నిలవాలనుకున్న సినిమాలను హైదరాబాద్ లోనే ప్రదర్శించనున్నారు.   సెప్టెంబర్ 16వ తేదీ నుంచి23వ తేదీ వరకు ఫిల్మ్ నగర్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన ఈ సినిమాలను వీక్షిస్తారు.60ఏళ్ల ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చరిత్రలో ఒక తెలుగు వాడు ఇంతటి గొప్ప అవకాశాన్ని చేజిక్కించుకోవడం ఇదే తొలిసారి.

సీవీ రెడ్డి.. తెలుగు, తమిళం,కన్నడ భాషల్లో దాదాపు 12 సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుండా నాలుగు చిత్రాలకు మాటలు, కథ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే   అందించారు. ఆయన మొదటి చిత్రం ‘బదిలీ’ కి 1995లో నంది అవార్డు వరించింది. ఆయన ‘ స్వర్గానికి వీడుకోలు’, ‘ వసంత’ అనే నవలలు కూడా రాశారు. వసంత నవలను సినిమాగా కూడా తీశారు

అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల కార్యక్రమం వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నారు. 90 సంవత్సరాలు సాగుతున్న ఈ కార్యక్రమానికి 60 ఏళ్లుగా భారత్.. తన సినిమాలను పంపుతోంది. కాగా.. ఇప్పటి వరకు ఒకే ఒక్క సినిమా మాత్రమే ఆస్కార్ గెలుచుకుంది. కాగా 1957లో మధర్  ఇండియా, 1998లో సలామ్ బాంబే, 2001లో లగాన్ నామినేషన్ల వరకు వెళ్లాయి.. కానీ అవార్డు గెలుచుకోలేకపోయాయి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !