
సచిన్ 10 నంబర్ జెర్సీ పై జరుతున్న వివాధం అందరికి తెలిసిందే... శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నాల్గో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన భారత ఆటగాడు శార్దూల్ ఠాకూర్ ఆరంభపు మ్యాచ్ లోనే విమర్శల పాలయ్యాడు. కారణం అతడు ధరించిన జెర్సీ నంబర్ 10. అది మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు కెటాయించిన జెర్సీ. అదే పదో నంబర్ జెర్సీని శార్దూల్ వేసుకున్నందుకు.
ఆ మ్యాచ్ శార్ధుల్ ధరించిన జెర్సీ పై నెటిజన్లే ఆయన పై విరుచుకుపడ్డారు. "సచిన్ మా దేవుడు ఆయన ధరించిన నంబర్ కల్గిన జెర్సీని నువ్వు ధరించడానికి వీలు లేదు". "నీకు సచిన్ పై ఏ మాత్రం గౌవరం ఉన్న తక్షణం ఆ జెర్సీని వదిలిపెట్టు". "స్టార్ ప్లేయర్లే 10 నంబర్ జెర్సీని ధరించలేదు నువ్వేంత..." అనే పలు రకాల కామెంట్లు చేశారు.. నెటిజన్లు.
అయితే సచిన్ శార్దుల్ కి స్పిన్నర్ హర్భజన్ సింగ్ అండగా నిలిచాడు... "శార్దూల్.. సచిన్ చూస్తూ పెరిగి ఉంటాడు. భారత జట్టుకు ఆడే క్రమంలో అతను పదో నంబర్ జెర్సీని వేసుకోవాలని అనుకుని ఉంటాడు. అది అతని కల కావొచ్చు. ఆ జెర్సీకి ఉన్న ప్రత్యేకత దానిదే. ఎవరో ఒకరు ధరించి ఆడటం వల్ల ఆ జెర్సీ నంబర్ విలువ తగ్గిపోదు. ఇందులో నాకు ఎటువంటి తప్పు కనిపించలేదు. మేమంతా సచిన్ కు గౌరవం ఇస్తా. అతను ఆడుతున్న సమయంలో ఎవరూ పదో నంబర్ ను ధరించే సాహసం చేయలేదు.ఇక్కడ సచిన్ గౌరవాన్ని తగ్గించారని అనుకోవడం లేదు" అని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు.
అయితే ఇది వరకే శార్ధుల్ ఠాకుర్ సచిన్ ఫ్యాన్స్ కి వివరణ ఇచ్చారు. తన పుట్టిన రోజును తేదీ, నెల, సంవత్సరం కలిపితే పది వస్తుందని, అందుకే 10 నంబర్ జెర్సీని ధరించానని తెలిపారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి