రెండో ప్రపంచ యుద్ధం కాల్పుల విరమణ ఉత్తర్వులివిగో...

First Published Jan 20, 2017, 9:21 AM IST
Highlights

రెండో ప్రపంచ యుద్ధం కాల్పలు విరమణ ఉత్తర్వులెవరిచ్చారు, కాపి ఎక్కడుంది?  ఇపుడా వివాదం సమసిపోయింది.

రెండవ ప్రపంచయుద్ధానికి చెందిన అరుదైన డాక్యుమెంటొకటి ఇపుడు బయటపడింది.

 

జర్మనీ సరెండర్ కావడంతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తెలిసిందే.అయితే,యుద్ధవిరమణకు సంబంధించి ఎవరు ఉత్తర్వు లిచ్చారు, ఎపుడిచ్చారు, ఇచ్చిఉంటే ఆ ఉత్తర్వులెక్కడ ఉన్నాయిఅనేది ఇప్పటి దాకా డాక్యమెంటు రూపంలో వెల్లడికాలేదు.

 

ఇపుడు  రెండవ ప్రపంచయుద్ధంలో కాల్పుల విరమణ ఉత్తర్వు కాపీ దొరికింది.

ఇదే అలైడ్ దేశాల కూటమి తరఫున విడుదలయిన మొదటి కాల్పుల విరమణ ఉత్తర్వు.దీనిని విడుదల చేసిన వాడు బ్రిటిష్ సేనల అత్యున్నత అధికారి  ఫీల్డ్ మార్షల్ బెర్నార్డ్ మాంట్గోమెరి.

 

ఈ ఉత్తర్వుల మీద ఆయన  1945, మే 4 వ తేదీన రాత్రి 8.50కి సంతకం చేశారు.

 

“ఈ  సంకేతం అందిన మరుక్షణం అన్ని ఎదురుదాడి కార్యకలాపాలన్నింటిని నిలిపివేయాలి”అని  ఆయన ఉత్తర్వులిచ్చాడు.

 

“(1945)మే 5 ఉదయం ఎనిమిది గంటలనుంచి కాల్పుల విరమణ పాటించాలని సైనిక బలగాలన్నింటికి ఉత్తర్వులివ్వడమయినది. ఈ రోజు 21 ఆర్మీ గ్రూప్  నకు స్థానిక జర్మన్ల లొంగుబాటుకు సంబంధించిన వివరాలు ముందొస్తాయి.”

 

జర్మన్ హై కమాండ్ మాంట్గోమెరి ఎదుట లొంగిపోయినరెండున్నరగంటల తర్వాత ఈ ఉత్తర్వులుతయారయ్యాయి.

 

ఈ డాక్యుమెంట్ నాటింగ్హామ్ లోని   ఇంటర్నేషనల్ అటోగ్రాఫ్ ఆక్షన్లో 1500పౌండ్ లకు ఈ డాక్యుమెంటును అమ్మకానికి పెట్టారని   మిర్రర్ పేర్కొంది.

 

“ఇది చాలా విలువయిన చారిత్రక పత్రం. ఎందుకంటే, జర్మన్లు  లొంగిపోవడానికి సంబంచింది. మొదటి అధికారిక సమాచారం ఇదే,”అని ఈ వేలం నిర్వహణ దారు ప్రతినిధొకరు చెప్పారు.

 

click me!