అమరావతిలో కలకలం

Published : Jan 20, 2017, 04:15 AM ISTUpdated : Mar 25, 2018, 11:38 PM IST
అమరావతిలో కలకలం

సారాంశం

రాజధాని రైతులు రెండుగా చీలిపోతున్నాారా...

ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి వచ్చాడు .వెళ్లాడు. అయితే, అతని కాలిజాడలు బలంగా పడ్డాయి. ఫలితంగా  అమరావతి రైతులు రెండు గ్రూపులుగా  విడిపోయారు. ఇందులో ఒక వర్గం జగన్ ని విశ్వసిస్తున్నవాళ్లు కాగ రెండో వర్గం  కళ్లముందు వర్ ల్డ్ క్లాస్ క్యాపిటల్ రంగుల కల చూస్తున్న వారు.

 

ఈ రెండు వర్గాలను కవ్వించేందుకు  జగన్ పర్యటన సందర్భగా ప్రయత్నాలు జోరుగా జరిగాయి. ఇటు వైపు ఫీల్డ్ లో జగన్ అటువైపు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు పార్టీ ఆఫీసులో.

 

రైతులకు జరుగుతున్న అన్యాయాలను చూపి,భూములను లాక్కుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని జగన్ ఆరోపిస్తే, జగన్ కాలు పడితే,  అమరావతి రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోతాయని, అందువల్ల జగన్ ని  అమరావతి గ్రామాల్లోకి రానీయ వద్దని లోకేశ్ బాబు పిలుపునిచ్చారు.

 

జగన్ సభలో ఒక వైపు జనం విరగబడటం,మరొక వైపు లోకేశ్ మాట వని కొన్ని గ్రామాలలో జగన్ గో బ్యాక్ నినాదాలు రావడం రైతుల్లో వచ్చిన విభజన ఫలితమే. రాజధాని రైతులు రెండు చీలిపోవడం రాష్ట్ర రాజకీయాల మీద తీవ ప్రభావం చూపే ప్రమాదం ఉంది. రాజధానుల ఎన్నికల ప్రవర్తన చిత్రంగా ఉంటుంది. న్యూఢిల్లీ గద్దెమీద మోదీ ఉంటాడు.ఢిల్లీని కేజ్రీవాల్ ‘ఆప్’ వశపర్చుకుంటుంది. రాష్ట్రమంతా తెలంగాణా ఉద్యమం నడుస్తున్నపుడు హైదరాబాద్ లో టిఆర్ ఎస్ కు ఒక్కటి రెండు సీట్లే వచ్చేవి.

 

దీనికి కారణం, ఏ పార్టీ అధికారంలో ఉన్నా  హైదరాబాద్ లో  ఎంఐఎంకు  ఏడెనిమిది సీట్లు పదిలంగా ఉంటాయి. తెలంగాణా వచ్చాక కూడా  హైదరాబాద్ లో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు బాగా సీట్లొచ్చాయి. రాజధాని ఓటర్లలో డైకాటమీ కొత్త కాదు. అమరావతిలో ఈ డైకాటమీకి బీజం పడిందా?

 

దీనికి కారణం, ఈ పార్టీలు  రాజధానిలో తమ పలుకుబడి ప్రాంతాన్ని నిర్మించుకోవడమే.

 

ఇపుడు జగన్  ఈ పనే చేస్తున్నారు. ఆయన సిఆర్ డి ఎ లో,అమరావతి నడిబొడ్డు మీద తన జండా పాతే ప్రయత్నం చేసి విజయవంతమవుతున్నారేమో అనిపిస్తూంది.

 

రాజధాని ఎక్కువ భూములు తీసుకుని తెలుగుదేశం ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నదని,  రాజధాని సమాచారం ముందే తెలుసుకుని  తెలుగుదేశం ప్రముఖులు వేల ఎకరాలు కొన్నారని ప్రచారం బాగా జరిగింది.

 

ఇది ప్రతిపక్షం మాత్రమే చేసిన ప్రచారం మాత్రమే కాదు.

 

చట్టబద్ధపాలన (రూల్ ఆఫ్ లా) కోసం పోరాడుతున్న మాజీ కేంద్ర కార్యదర్శి ఇఎఎస్ శర్మ, మాజీ చండీగడ్అ డ్మినిస్ట్రేటర్ దేవ సహాయం, మేధాపట్కర్, ఏచూరి సీతారాం వంటి మేధావులు చెబుతున్న మాట ఇది.  ఇది నిజమని, తమ భూములను కాపాడుకుంటే, భవిషత్తులో తామే విక్రయించుకుని లబ్ధిపొందవచ్చనే రైతులు పెద్ద ఎత్తున తయారయ్యారు.  ఈ గ్రామాలన్నీ జగన్ తోనే ఉన్నాయని పిస్తుంది.

 

 

కొన్ని గ్రామాల్లోని రైతులు జగన్ని అడ్డుకోవడం, మా ఊరికి రావద్దని ఫ్లెక్సీలు కట్టడం, పోలీసులు జగన్ కాన్వాయ్‌ను మాత్రమే అనుమతించడం, తారస పడిన వైసిపి/టిడిపి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియపై వైకాపా కార్యకర్తలు దాడి చేసే ప్రయత్నం ఇవన్నీ కూడా సిఆర్ డిఎ జగన్ జండా పాతుతున్నాడనే భయం నుంచి వచ్చిన రియాక్షనే.

 

ఏది ఏమయినా, తాను ఈ పర్యటనలో  చెప్పినట్లు ఇక జగన్ కూడా ముఖ్యమంత్రి నివాసానికి ధీటైన బంగళా ఒకటి కొని పర్మనెంట్ అడ్రసు ఏర్పాటు చేసుకుంటే, సిఆర్ డిఎ లో రైవల్ పవర్ సెంటర్ ఏర్పడటం ఖాయం. రాయలసీమ వాళ్లకు రాజధాని ప్రాంతం అంతతొందరగా మచ్చిక  కాదు,కులపెత్తనం, ప్రాంతీయత,  నీళ్ల  నాగరికత  కారణాలు కావచ్చు.  అయితే, జగన్ అక్కడ కాలూనడానికి అసరమయిన, బలమయిన పట్టు సంపాదించుకుంటున్నాడు.

 

 రానున్న రోజుల్లో జగన్  కు చిరునామా దొరగ్గానే  వచ్చే రెండున్నరేళ్లలో రాజధాని రాజకీయాలు  బాగా వేడెక్కే సూచనలు కనబడుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !