కౌలలాంపూర్ లో కనువిందు చేసే 15 పర్యాటక ప్రదేశాలు

First Published Jan 22, 2017, 4:57 PM IST
Highlights

మలేసియా అందాలరాశి. ఎంత చూసినా తనివి తీరని ప్రాకృతిక, భౌగోళిక సౌందర్యం మలేసియా సొంతం. ఒక సారి సందర్శిస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపించే వశీకరణ శక్తి మలేసియాకు ఉంది. మలేసియా సందర్శించి కొన్ని రోజులు ఆహ్లదకరంగా సేదతీరాలనుకునే వారి కోసం ఎయిర్ఎసియా అందరికీ అందుబాటులో ఉండే ఆకర్షణీయ ప్యాకేజీలను రూపొందించింది.

ఆకుపచ్చ చీరకట్టుకున్న హరిత ద్వీపాలు ఒక వైపు... నిత్యం చిరుజల్లులను ఒడిసిపట్టుకునే పచ్చని అడువులు మరోవైపు... అంతేనా సహసం సేయరా డింభకా అంటూ రారమ్మని పిలిచే ప్రదేశాలు మరోవైపు... ఇంకా తరతరాల  కట్టడాలు, సాంస్కృతిక సౌరభాలతో విలసిల్లే ప్రదేశాలు మరోవైపు.. అందమైన ద్వీపాల నుంచి వన్యమృగ అడువుల వరకు ప్రతి ప్రాంతాన్ని ఆస్వాదించేలా అన్ని రకాల యాత్రికుల అభిరుచికి తగని పర్యాటక స్వర్గధామం కౌలలాంపూర్.

కమ్మని భోజనం, డిస్కౌంట్ ఆఫర్లతో ఊరించే షాపింగ్, సాగర గర్భంలో సాహస క్రీడలు మిమ్మల్ని  ఈ నగరానికి రా రామ్మని ఆహ్వానిస్తాయి.  విలక్షణమైన ద్వీపాల అంతర్భాగంలోని అందమైన లోతులు, పగడపు దిబ్బల ముగ్దమనోమర సౌందర్యాలు మిమ్నల్ని పులకింపచేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం బ్యాగులు సర్దేసి కౌలలంపూర్ ఫ్లైట్ ఎక్కడానికి రెడీ గా ఉండండి.. ఏయిర్ ఆసియా ప్రత్యేకంగా మీ కోసం అతి తక్కువ ధరల్లోనే ఈ కౌలలాంపూర్ ట్రిప్ ను అందిస్తుంది...

Click here to book your flights NOW!!!

అబ్బుర పరిచే నిలువెత్తు ‘ పెట్రొన’ టవర్స్...

సముద్రమట్టానికి 452 మీటర్ల ఎత్తులో ఉండే పెట్రోనా టవర్స్ మలేసియాకే మణిమకుఠం లాంటివి. అందుకే ఈ దేశానికి వచ్చే ప్రతీ పర్యాటకుడు కౌలలాంపూర్ కు వచ్చి ఈ అద్భుతాన్ని చూడకుండా వెళ్లలేడు.ప్రపచంలోనే అత్యధిక ఎత్తైన భవంతుల్లో ఒకటిగా ఈ ట్విన్ టవర్స్ గుర్తింపు పొందాయి. 86 అంతస్తుల ఈ టవర్ పై భాగం నుంచి చూస్తే  కౌలలాంపూర్ అందాన్నంతా  వీక్షించవచ్చు. అలాగే, ఈ టవర్ లోని 41 వ ఫ్లోర్ లో ఉండే స్కై బ్రిడ్జ్ మరో అదరపు ఆకర్షణ.

 కేఎల్ విహంగ వనానికి  చలో..చలో..

నగరం మధ్యలో ఉండే ఉష్ణమండల వర్షారణ్య ప్రాంతం కేఎల్ పక్షుల పార్కు. ఇందులో మూడు వేల రకాల పక్షి జాతులతో అలరించే  20.9 ఎకరాల సహజ ఆవాస ద్వీపం మిమ్మల్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తుంది. రంగురంగుల సీతాకోకచిలుకలంటే ప్రాణమిచ్చేవారికి ఇదో అద్భుతమైన గమ్యస్థానం. ఇక్కడ అడుగుపెడితే ప్రకృతితో మమేకమైపోతాం.

కౌలలాంపూర్ లో సొమ్మసిల్లే దాకా  షాపింగ్

ప్రపంచంలోని టాప్ 5 షాపింగ్ సెంటర్లలో కలాలంపూర్ లోని కేఎల్ షాపింగ్ సెంటర్ ఒకటి. ఇక్కడ ప్రతి రోజు పండగ సీజనే. అందుకే అతి తక్కువ డిస్కౌంట్ లో షాపింగ్ చేయోచ్చు. బుకిట్ బింటాగ్ నుంచి మీ షాపింగ్ మొదలు పెడితే కౌలాలంపూర్ సిటీ సెంటర్ వరకు మీరు వరసపెట్టి షాపింగ్ చేయోచ్చు. ఇక్కడ 9 అతిపెద్ద షాపింగ్ మాల్స్ మిమ్మల్ని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటాయి.

విందుకు ‘రహదారి’ జలన్ అలోర్

స్ట్రీట్ ఫుడ్ కు కేరాఫ్ అడ్రస్ కౌలలాంపూర్. ముఖ్యంగా మలేసియా రుచులను ఆస్వాదించాలంటే జలన్ అలోర్ కు వెళ్లాల్సిందే. రుచికరమైన మలేషియా సంప్రదాయ రుచులను ఇక్కడ లొట్టలేసుకుంటూ తినొచ్చు.

బటు గుహల్లోకి పాకితీరాలి

భారతీయ మలేసియన్ల ఆధ్యాత్మిక సంపదగా వర్ధిల్లుతోంది అతి పురాతన మురగన్ టెంపుల్ . బటు గుహలపైన 200 అడుగులు ఎత్తులో ఉన్న ఈ  సుబ్రహ్మణ్య దేవాలయాన్ని చూడటానికి ప్రపంచం మొత్తం నుంచి లక్షల మంది ఇక్కడికి తరలివస్తుంటారు. ఇక బటు గుహల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఆ గుహల నుంచి పైనున్న మురగ ను దర్శించుకునేందుకు చేసే ప్రయాణం ఓ సహస ఆధ్యాత్మిక యాత్ర గా అభివర్ణించవచ్చు. ముఖ్యంగా తమిళులు నిర్వహించే దీపోత్సవం సమయంలో ఈ ఆలయం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.

సందడంతా గెంటింగ్ హైల్యాండ్స్
జెంటింగ్ హైల్యాండ్స్ చూడకుండా ఉంటే మీ మలేసియా ట్రిప్ అసంపూర్ణమే అవుతుంది. మలేసియాలో సందడంతా ఇక్కడే ఉంటుంది. అందుకే దేశంలో ఎంటర్ ట్ర్రైన్మెంట్ హబ్ గా ఇది వెలుగొందుతుంది. థీమ్ పార్కులు, కెసీనోలు, సహస క్రీడలు, రెస్టారెంట్లతో అలరారే గెంటింగ్ పార్కు మిమ్మల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది.

Click here to book your flights NOW!!!

సాహసంతో తడిపి ముద్ద చేసే ‘ల్యానంగ్కావి’ దీవులు

జానపద నవలలో చదివే అందమైన పగడపు దీవులు నిజంగా చూడాలా... పచ్చని చీరకట్టుకున్న దీపాలను దర్శించాలా .. అయితే మీరు ల్యానంగ్కావికి వెళ్లాల్సిందే.  కేబుల్ కార్ రైడ్లు, జల క్రీడలు, సహస కృత్యాలు చేయాలనుకునేవారికి ఇది చక్కటి గమ్యస్థానం. ముఖ్యంగా సముద్ర గర్భంలోని అందాలను చూసే అద్భుత అవకాశం మీకు ఇక్కడ మాత్రమే సాధ్యమవుతుంది.

తూర్పున మెరిసే ముత్యం పెనాంగ్ ను చూడండి

యునెస్కో వారసత్వ కట్టడంగా గుర్తంపు పొందిన పెనాంగ్ మరో పర్యాటక ప్రదేశం. తూర్పు, పశ్చిమల సంస్కృతికి వారధిగా ఆకర్షించే ఈ ప్రాంతం పురాతన వాస్తు నిర్మాణాలకు ప్రసిద్ధి. మఖ్యంగా జార్జ్ టౌన్  నిర్మాణ కౌశలాన్ని చూడాలంటే రెండు కళ్లు చాలవు.

మలక్కా మూలాల్లోకి తొంగిచూస్తారా

ఫ్రెంచ్, డచ్, పోర్చు గీస్ ల గత కాల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే అద్భుత ప్రదేశం మలక్కా. అందుకే ఇది కూడా యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రతి అణువు గత కాలపు ఘనమైన వారసత్వాన్ని తట్టిలేపుతాయి.

కినబాలు శిఖరం... ఎక్కడానికి రెడీనా...

సహస యాత్రకు కేరాఫ్ అడ్రస్ కినబాలు శిఖరం. పర్వతారోహకులు ఇష్టపడే ప్రదేశాలలో ఇదీ ఒకటి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు కూడా పొందింది. ఈ శిఖరం అందాలను చూడడాని వచ్చే యాత్రికులు కొందరైతే, ఇక్కడి అడువుల్లో ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించే సాహసికులు మరికొందరు.

సెపిలోక్ నేచర్ రిజర్వులో ఒరంగుటాన్ ను చూడండి...

అందమైన మడ అడువులు... వర్షాధారఅరణ్యాలలో సంచరించే ఒరంగుటాన్ లను చూడాలంటే ఇక్కడి సెపిలక్ నేచర్ రిజర్వ్ కు రావాల్సిందే. అందమైన పక్షుల కిలకిలారావాలతో అలరారే ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులను అలరిస్తుంది.

Click here to book your flights NOW!!!

 

కినబటాన్గన్ నదిలో సఫారీ...

జంతు ప్రేమికులకు ఇదో అద్భుతమైన యాత్రగా చెప్పొచ్చు. కినబటాన్గన్ నదిలో పడవ ప్రయాణం ఓ గొప్ప అనుభూతి అయితే నది చుట్టూ ఉన్న అందమైన జంతుజాలాన్ని వీక్షించడం మరో రకమైన అనుభూతి. ఇక మీరు కాస్త సాహసవంతులైతే ఈ పడవ ప్రయాణాన్ని రాత్రి పూట పెట్టుకుంటే రెట్టింపు అనుభూతి పొందడం ఖాయం.

రెడాంగ్ ద్వీపం ఒక మునకేయండి

31 డైవింగ్ సైట్ లతో మిమ్మల్ని సంబ్రమాశ్చర్యాలకు గురించేస్తుంది రెడాంగ్ ద్వీపం. రెండో ప్రపంచ యుద్దానికి సంబంధించిన ఓడల అవశేషాలు ఈ దీవికి మరో ఆకర్షణ. ఈ దీవి అంతర్భాగంలోని అందాలు చూడాలంటే కాస్త సహసం చేయాల్సిందే. ఇక్కడ 500 రకాల పగడపు దిబ్బలు, 3 వేల రకాల చేప జాతులున్నాయి.

Click here to book your flights NOW!!!

అతిపురాతన వర్షారణ్య ప్రాంతం  తమన్ నెగర

ప్రపంచంలోని అతి పురాతన వర్షారణ్యంలో షికారు చేయాలా... అయితే తమన్ నెగర కు రావాల్సిందే. దాదాపు 130 మిలియన్ సంవత్సరాలకు చెందిన అతి ప్రసిద్ధ ప్రాంతం ఇది. ముఖ్యంగా ఆకుపచ్చని పందిరిలా పరుచుకున్న చెట్టుకొమ్మల మధ్య నుంచి సుదూర ప్రయాణం చేసే ఏకైక అవకాశం ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. అలాగే, అతి పురాతన సున్నపు గుహలను కూడా ఇక్కడ దర్శించవచ్చు.

సరవాక్ సంస్కృతి ను సందర్శించండి

మలేసియాలోని గిరిజనుల జీవన చిత్రాన్ని వారి సంస్కృతి సంప్రదాయాలను చూడాలంటే సరవాక్ మ్యూజియం లో అడుగుపెట్టాల్సిందే. ఇక్కడే వారి సంప్రదాయ నృత్యాలను కూడా చూడవచ్చు. అలాగే వారు తయారు చేసిన కళాకృతులను కూడా కొనుక్కోవచ్చు.

 

ఇంకెందుకు ఆలస్యం... మీ లగేజీ సర్దుకోండి... అతి తక్కువ ఫ్లైట్ టికెట్ తో మలేసియా లోని ప్రతి అణువును వీక్షించేందుకు సిద్ధంకండి.. కేవలం ఏయిర్ ఏసియా మాత్రమే అతి తక్కువ ధరల్లో ఈ మలేసియా ప్రత్యేక పర్యాటక యాత్రను మీకోసం అందిస్తోంది.

 

రండి... ఇక్కడ క్లిక్ చేయండి.. మలేసియా ట్రిప్ కు టికెట్ బుక్ చేసుకోండి అతి తక్కువ ధరల్లో...

 

Click here to book your flights NOW!!!

#Malaysia Holidays, #Petrona Towers, #Kuala Lumpur shopping, #Batu Caves, #Genting Highlands, #Langkawi Island, #Malacco

 

 

 

 

click me!