ఆ రోజు మహిళలకు బస్ జర్నీ ఉచితం..

Published : Aug 04, 2017, 04:57 PM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఆ రోజు మహిళలకు బస్ జర్నీ ఉచితం..

సారాంశం

రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు ఏసీ బస్సల్లో మాత్రం ప్రయాణం చేయాలి

 

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మహిళలకు శుభవార్త.రాఖీ పండు రోజు మహిళలందరూ రాష్ట్రవ్యాప్తంగా బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇలాంటి సదుపాయాన్ని కల్పించడం యూపీలో ఇదే తొలిసారి. కాకపోతే కేవలం నాన్ ఏసీ బస్సల్లో మాత్రం ప్రయాణం చేయాలి. ఈ నెల 6వ తేదీ రాత్రి నుంచి 7వ తేదీ అర్ధరాత్రి వరకు ప్రయాణించవచ్చని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. యూపీస్ ఆర్టీసీ నూతనంగా తలపెట్టిన పలు ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ  సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. లక్నో, ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్, గోరఖ్ పూర్, అలీఘర్య సహా మొత్తం 66 జిల్లాల్లోని 75 బస్ స్టేషన్లలో వైఫై ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !