కోర్టుకు హాజరైన సల్మాన్ ఖాన్

Published : Aug 04, 2017, 03:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
కోర్టుకు హాజరైన సల్మాన్ ఖాన్

సారాంశం

కోర్టుకు సల్మాన్ అక్టోబర్ 5కు వాయిదా 

 

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఈరోజు కోరుట ఎదుట హాజరయ్యారు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న కేసులో జోధ్‌పూర్‌ సెషన్స్‌ కోర్టు సల్మాన్‌కి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈకేసు వాదనను న్యాయస్థానం అక్టోబర్‌ 5కు వాయిదా వేసింది. కాగా..సల్మాన్ కేవలం రూ.20వేల విలువైన బెయిల్ బాండ్ ను దాఖలు చేసేందుకే కోర్టుకు వచ్చాడని , ఏ విధమైన హియరింగ్ లేదని ఆయన తరపు న్యాయవాది హస్తిమల్ సారస్వత్ వెల్లడించారు. గతంలోనూ కృష్ణజింకను చంపిన కేసు, హిట్‌ అండ్‌ రన్‌ కేసులోనూ సల్మాన్‌ పలుమార్లు కోర్టు విచారణకు హాజరైన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !