గ్రామస్థులను చిన్న కోరిక కోరిన కెసిఆర్

Published : Aug 04, 2017, 04:01 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
గ్రామస్థులను చిన్న కోరిక కోరిన కెసిఆర్

సారాంశం

కేశవరం గ్రామసభకు హాజరయిన ముఖ్యమంత్రి గ్రామ సభ ముందు తన చిన్న కోరికనుంచిన కెసిఆర్ వరాలిచ్చి తనకొరికా తీర్చమన్న ముఖ్యమంత్రి

 

తెలంగాణా ముఖ్యమంత్రి  కె చంద్రశే ఖర్ రావు  ఈ రోజ మేడ్చల్ జిల్లా కేశవరం గ్రామ ప్రజలను చిన్న కోరిక కోరారు. గ్రామస్థులు  కోరినవన్నీ ఇచ్చాక, ముఖ్యమంత్రి, నాకూ ఒక చిన్న కోరిక ఉంది, అది మీరు తీర్చాలని అడిగారు. గ్రామస్థులు విస్తుపోయారు.

 ‘నాది కూడా ఓ చిన్న కోరికే. హరిత హారం ప్రోగ్రాం పెట్టుకున్నాం.హైదరాబాద్ లో ఉష్ణోగ్రత 48 డిగ్రీలకు చేరుకుంది. వర్షాలు వస్తలేవు. కోతులు ఊర్లకు వస్తున్నాయి. నానా అవస్థలు పడుతున్నాం.పర్యావరణం దెబ్బ తింటే ఎన్ని ఆస్తులున్నా దండగే. మనం, మన పిల్లలు   భవిష్యత్తులో మంచిగా బతకాలంటే చెట్లు నాటాలే. మీరు ఈ కార్యక్రమంలో చెట్లునాటాలే,’ అని చప్పట్ల మధ్య  కోరారు.

ఈ రోజు ముఖ్యమంత్రి మేడ్చల్ జిల్లా కేశవరం గ్రామ సభలో పాల్గొన్నారు.గ్రామస్థులు చెప్పిందంతా విన్నారు. పలు అభివృద్ధి పనులకు ₹ 10 కోట్ల 27 లక్షలు కావాలని గ్రామస్థులు అడిగారు.అంతే, ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించారు.

గజ్వెల్ తో సమానంగా మేడ్చల్ అభివృద్ధి  జరుగుతందని ముఖ్యమంత్రి చెప్పారు.                   

గోదావరి జలాలతో కేశవరం చెరువు నింపుతాం. ఆ రోజు నేను వస్తానని కూడా చెప్పారు.                      

రేపు మధ్యాహ్నం కల్లా జీవోలు గ్రామస్థుల కోరిన వాటికి జివొలు విడుదల చేయాలని కూడ అధికారులను ఆదేశించారు.                      

ఎల్లుండి నుంచే పనులు ప్రారంభమవుతాయని వారికి చెప్పారు.                        

‘ఇకనుంచి రైతులు ఆఫీస్ ల చుట్టూ తిరగడం బందు కావాలె. లంచాలు తగ్గాలి.రిజిస్ట్రేషన్ ల ప్రక్రియలో ప్రక్షాళన. రికార్డ్ లు క్లీన్, అప్ డేట్. పారదర్శకంగా రెవిన్యూ వ్యవస్థ.రిజిస్ట్రేషన్ లు జరిగిన వెంటనే మ్యుటేషన్ లు జరిగేలా చర్యలు,’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

 గ్రామంలో రోడ్లు, ఎల్ఈడీ లైట్ లు, కరెంట్ పోల్స్, అంగనవాడీ పెండింగ్ బిల్లులు, కమ్యూనిటీ హాల్, స్మృతివనం తదితర అవసరాల కోసం నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కేశవరం గ్రామస్తులు కోరారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !