మొబైల్ లో మాట్లాడుతూ మేడ మీదినుంచి పడింది

Published : Jun 19, 2017, 11:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
మొబైల్ లో మాట్లాడుతూ మేడ మీదినుంచి పడింది

సారాంశం

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని భాగ్యనగర్‌లో సోమవారం వేకువజామున విషాదం చోటు చేసుకుంది. అర్థరాత్రి తర్వాత 2.30గంటల ప్రాంతంలో త్రిపుర అనే యువతి తాము ఉంటున్న మహాలక్ష్మీ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్తు గోడపై కూర్చుని ఫోన్‌ మాట్లాడుతూ ప్రమాదవశాత్తూ భవనంపై నుంచి జారిపడింది.

పెద్ద శబ్దం రావడంతో కింద ఫ్లోర్‌లో ఉంటున్న వారు బయటకొచ్చి చూడగా రక్తపుమడుగులో పడి అక్కడికక్కడే చనిపోయిన త్రిపుర కనిపించింది.

ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించారు. వీరి కుటుంబం చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. విషయం పోలీసులకు తెలిసి ప్రమాదవశాత్తు జరిగిందా మరింకేదైనా కోణం ఉందా అని కూడా కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంట్లో ఆమె పెద్ద కుమార్తె. ఓ కుమారుడు కూడా ఉన్నాడు. కానీ, కుటుంబానికి మాత్రం ఆమెనే భరోసా. ఇటీవలె బీటెక్‌ పూర్తి చేసుకున్న ఆ యువతి బ్యాంకు ఉద్యోగం కూడా సంపాధించింది. ఇక తమ కష్టాలు గట్టెక్కినట్లే అని తల్లిదండ్రులు ఊపరిపీల్చుకుంటున్న తరుణంలోనే గుండెబద్దలయ్యే దుర్ఘటన చోటు చేసుకుంది. దురదృష్టవశాత్తు ఆ యువతి మృత్యువాత పడింది. ఫోన్‌ మాట్లాడుతూ ఐదో అంతస్తు నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ కుటుంబమంతా తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu