వైజాగ్ లోకి జగన్ ను అనుమతిస్తారా, అడ్డుకుంటారా?

First Published Jun 19, 2017, 10:43 AM IST
Highlights

వైజాగ్ భూ కుంభకోణం మీద జూన్ 22వ తేదీన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు నాయకత్వం వహించాలి. అదే రోజు టిడిపి మహాసంకల్పం పేరుతో పోటీ ధర్నా దిగుతూ ఉంది. అందువల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని జగన్ వైజాగ్ లోకి రాకుండా అడ్డుకుంటారా, లేక అనుమతిస్తారా? జనవరి 26 పునరావృతమవుతున్నట్లుంది.

జూన్ 22వ తేదీన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాకు నాయకత్వం వహించాలి. ధర్నా ఎందుకు చేస్తున్నారంటే, విశాఖ దాదాపు 20 వేల కోట్ల రుపాయల భూమును తెలుగుదేశం మంత్రులు, ఎంపిలు,ఎమ్మెల్యేలు కాజేశారనే ఆరోపణ మీద సిబి ఐ విచారణ జరగాలని వైసిపి కోరుతున్నది. దేశంలో ఇంత పెద్ద ఎత్తున భూముల రికార్డులు మాయమంచేసి  ప్రభుత్వంలో ఉన్న పెద్దలు భూములు స్వాహా చేసిన సంఘటన మరొకటి ఉండదేమో. ఇదేవరో జగన్ చేసిన ఆరోపణ కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి క్యాబినెట్ సహచరుడు అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణ.

 

జగన్ ధర్నా కు వ్యతిరేకంగా అదే రోజు, అదే చోట తెలుదశం పార్టీ మహాసంకల్పం పేరుతో కార్యక్రమం ఏర్పాటుచేసింది. అంటే, కొట్లాటకు సిద్ధమయ్యారన్న మాట. ఆరోజు రెండు వైరి పార్టీలు ధర్నా అంటే వైజాగ్ లో ఉద్రిక్తవాతావరణం ఏర్పాడుంది. పోలీసులు నిషేధాజ్ఞలు విధిస్తారు.  జగన్ ఊర్లోకి వచ్చి ధర్నా చేయకుడా అడ్డుకునేందుకు రంగం తయారు కావచ్చు.

 

ఈ మొత్తం వ్యవహారం చూస్తే జనవరి 26  జరిగిన సంఘటన పునావృతమవుతన్నట్లనిపించడలేదూ? ఆ రోజు జగన్  విశాఖ విమానాశ్రయంలో దిగగానే వూర్లోకి రాకుండా ఆపేశారు. జగన్ అక్కడే బైఠాయించాల్సి వచ్చింది(వీడియో). ఎపుడో తర్వాత మధ్యాహ్నం మరొక విమానంలో హైదరాబాద్ తిప్పి పంపారు.

 

 

 జనవరి 26న ప్రత్యేకహోదా కోరుతూ రాష్ట్రంలోని యువత యావత్తు విశాఖప్నటం  ఆర్కె బీచ్ వద్ద కొవ్వుత్తుల ఉద్యమం చేయాలంటూ హటాత్తుగా ఓ ఉద్యమం మొదలైంది. దానికి ప్రతిపక్షాలంతా వత్తాసు పలకటంతో ఒక్కసారిగా ఊపొచ్చింది.

 

దాంతో ప్రభుత్వంలో ఉలిక్కిపాటు మొదలైంది. ప్రభుత్వం ఎక్కడికక్కడ 144 సెక్షన్ అమలు చేసింది. రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలైన విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, కాకినాడ తదితర పట్టణాల్లో ఉదయం నుండి యువత గుమిగూడారు. దాంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. విశాఖపట్నం నగరంలోకి వెళ్ళే అన్నీ దారులను పోలీసులు మూసేసారు.

 

 అయితే,మధ్యహ్నంపైన జగన్ విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జగన్ దిగారు.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు అరెస్టు చేసేందుకు సిద్ధమయ్యారు.  ఈ పన్నాగం కనిపెట్టిన జగన్ బయటకు రాకుండా రన్ వే పైనే కూర్చున్నారు.  విమానాశ్రయం రన్ వేపై నుండి లేచి బయటకు రావాల్సిందిగా పోలీసులు జగన్, తదితరులను బ్రతిమలుడుతున్నా, జగన్ పట్టించుకోలేదు. మొత్తానికి జగన్ ఎయిర్ పోర్ట్ దాటి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ సారి ఇదే జరుగుతుందా అనే అనుమానం వైసిపి విశాఖ నాయకుల్లో వుంది. ఈసారి విమానశ్రయంలో అపేస్తారా, ధర్నా దగ్గిర అరెస్టుచేస్తారా... వేచి చూడాలి.

click me!