హైదరాబాద్ అద్దెగర్భాల అక్రమ వ్యాపారం అడ్డా

First Published Jun 18, 2017, 7:11 PM IST
Highlights

ఇంత నిర్భయంగా ఈ  అద్దె గర్భాల చీకటి వ్యాపారం సాగించేందుకు కారణం ఇందులో కోట్ల రాబడి ఉండటమే. హైదరాబాద్ లో ఈ వ్యాపారానికి  కచ్చితమయిన లెక్కలు లేకపోయినా  ఏడాదికి  రు. 50 కోట్ల దాకా ఉండవచ్చని నగరానికి చెందిన ఎంబ్రియాలజీస్టు ఒకరు అంచనా వేశారు.

 

హైదరాబాద్ ఎప్పటి నుంచో అద్దె గర్భాల  (సరోగసీ)హబ్. కేంద్రం నిషేధించినా ఈ వ్యాపారం జోరుగా సాగుతూ ఉందని,నిన్న పోలీసుల దాడిలో వెల్లడయిన భయంకరమయిన  ఇందులో విపరీతయమయిన రాబడి ఉంది కాబట్టి గుట్టు చప్పుడుకాకుండా ఇన్ ఫైర్టయిలిటీ సెంటర్లన్నీ అరొకొర వసతులతో అద్దెగర్భధారణ అరేంజ్ చేస్తున్నాయి.

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 14లో సాయికిరణ్‌ సంతాన సాఫల్య కేంద్రం ఈ బిజినెస్ ని  చాలా కాలంగానే కాదు, భారీగా నిర్వహిస్తున్న విషయాన్ని పోలీసులు, వైద్యాధికారులు బయటపెట్టారు.

 

ఏజెంట్లను రంగంలోకి దించి  డబ్బు ఎరవేసి వివిధ రాష్ట్రాల నుంచి పేద మహిళలను తీసుకువచ్చి అద్దెగర్భానికి ఒప్పిస్తున్నారు. ఈ పక్కా సమాచారంతో నిన్న తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఆశ్చర్యం కరమయిన, అమానుషమయిన విషయాలు వెల్లడయ్యాయి. 48 మంది మహిళను  ఈ సెంటర్ వారు ఈ బిజినెస్ లోకి దించారు.. వీరిలో 16 మంది తెలుగు వారున్నారు.  గర్భం అద్దెకు ఇచ్చినందుకు  ఒక్కో మహిళకు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలు చెల్లించారు. ఈ వ్యాపారానికి అవసరమయిన అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ(ఏఆర్‌టీ)అనుమతి ఉండాలి. అయితే, ఈ కేంద్రానికి ఇలాంటిదేమీ లేదు.

 

ఇంత నిర్భయంగా ఈ చీకటి వ్యాపారం సాగించేందుకు కారణం, ఇందులో కోట్ల రాబడి ఉండటమే. హైదరాబాద్ లో ఈ వ్యాపారానికి లెక్కలు లేకపోయినా  ఏడాదికి యాభై కోట్ల దాకా ఉండవచ్చని నగరానికి చెందిన ఎంబ్రియాలజీస్టు ఒకరు రఫ్ గా అంచనా వేశారు.

ఇది ఇంతకాలం సాగుతు ఉందంటే, కొంత మంది అవినీతి అధికారుల అండ కాదనలేం. ఎందుకంటే,  అద్దెగర్భాల మీద ఆంక్షలున్నా,  అధికారులు నగరంలోని ఇన్ ఫర్టయిలిటీ సెంటర్ల మీద నిఘా వేయాలేదని అర్థమవుతుంది. ఎందుకంటే, ఢిల్లీ వంటి చోట్ల కూడ సర్రొగసి అక్రమాలు బయటపడ్డాక భారతదేశంలో అద్దె గర్భాల కుంభకోణాలకు హైదరాబాదే అడ్డ అనే పేరొచ్చింది. ఇప్పటినుంచి కాదు, కనీసం పదేళ్లుగా ఈ వ్యాపారం ఇక్కడ సాగుతూ ఉంది.

ఇతర దేశాలలో అద్దెగర్భాలు దొరకడం కష్టం కావడంతో  విదేశీయులు భారత్   వచ్చి భారీగా చెల్లించి  సంతానం పొందిన సందర్భాలున్నాయి. ఇందులో మోసాలు కూడా ఎన్నో జరిగాయి. ఉదాహరణకు 2014లో మోర్గాన్ న్యూటన్ అనే ‘గేష తన భాగస్వామితో సంతానం కావాలనుకుని ఢిల్లీ వచ్చాడు.వాళ్లకి  ఢిల్లీ లోని ఐఎస్ ఐ ఎస్ అనే సెంటర్ కవలలను అద్దెగర్భం ద్వారా అందించారు దీనికి గే జంట ఫర్టయిలిటీ సెంటర్ కు రు. 27 లక్షలు చెల్లించింది. అయితే, తీరాచూస్తే, ఈ కవలలు వారి సంతానం కాదు.వీరు వెేవరరో సంతానమని జన్యపరీక్షలో బయటపడింది. ఈ కేసుకోర్టుకెళ్లింది. మోసం బయటపడింది.ఇలాగే అడమ్ బర్మన్ అనే మరొక అమెరికా దేశస్థుడు కూడా జన్యుపరంగా తనకు సంబంధంలేదని పిల్లాడిని తనకు కనిపిచ్చి డబ్బు లాగారని ఫిర్యాదు చేశాడు. అమెరికా వాళ్లు కాబట్టి జన్యు పరీక్షల దాకా వెళ్లి వెరిఫై చేసుకున్నారు. భారతీయులకు అంత అవగాహనం ఉంటుంందా. ఇక్కడు అండం, వీర్యకణాల దుర్వినియోగం జరగుతు ఊందని  ఆరోపణలొచ్చాయి.

 

ఇపుడు హైదరాబాద్ నడిబొడ్డున ఇంత భారీ అద్దెగర్బాల అడ్డగోలు వ్యాపారం బయటపడ్డాక దేశంలో ఇంకా ఎన్నిచోట్ల ఇలాంటిది సాగుతుందో వూహించవచ్చు. సంతానం కావలసి వాళ్లకు ప్రపంచంలో కొదువ లేదు, ఇలాగే, , గర్భాన్ని అద్దెకిచ్చి పేదరికం నుంచి బయటపడాలనుకనే పేదమహిళలకు కొదువ లేదు ఇక్కడ.

 

ఎన్ని సరోగసీ క్లినిక్‌లు పనిచేస్తున్నాయో లెక్కలేదుగాని  2013 లో జరిపిన ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ లో  60 కేంద్రాలుండేవి. ఇందులో ఆరింటికే అనుమతి ఉండింది.  వాటిపై వైద్య ఆరోగ్యశాఖకు ఎలాంటి నియంత్రణ లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి, అధికారుల, సర్రొగసి సెంటర్ల సంబంధాలు బెడిసి ఈ వ్యవహారం బయటపడి ఉండవచ్చని  డాక్టరొకరు అనుమానిస్తున్నారు.

click me!