విండోస్-10 లో త‌ప్పు ప‌ట్టు కోటిన్న‌ర కోట్టు

First Published Jul 27, 2017, 6:04 PM IST
Highlights
  • బంపర్ ఆఫర్ ప్రకటించిన మైక్రోసాప్ట్
  • విండోస్ 10 లో తప్పులు పట్టుకుంటే కోటిన్నర ఇస్తారు.

మైక్రోసాప్ట్ ప్ర‌పంచానికి బాగా ప‌రిచయం. ఇప్ప‌టికే ప్ర‌పంచంలో ప్ర‌తి 5 మందిలో ముగ్గురు మైక్రోసాప్ట్ ప్రోడ‌క్ట్‌ల‌ను వాడుతున్నారు. విడోస్ 7 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ త‌రువాత వ‌చ్చిన ఏ ఓఎస్ అంత‌గా ఆక‌ట్టుకోలేదు. విండోస్ 7 త‌రువాత విడోస్ 8, 8.1, 10లు వ‌చ్చాయి. విండోస్ 8, 8.1 లు అనుకున్నంత‌గా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు పోలేదు. 

చాలా త‌క్కువ స‌మ‌యంలోనే విండోస్ 10 ను మార్కేట్ లోకి తీసుకొచ్చింది. మైక్రోసాప్ట్ ఐటీ నిపుణులకు ఓ పెద్ద సవాల్‌ విసిరింది. మైక్రోసాప్ట్ విడుదల చేసిన విండోస్‌-10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో లోపాలున్నట్లు గుర్తించి తమకు ముందుగా తెలియజేస్తే 2,50,000 అమెరికన్ డాలర్ల వరకు బహుమతిగా చెల్లిస్తామని తన అధికారిక బ్లాగులో పోస్టు చేసింది. 

మైక్రోసాప్ట్ ఇలాంటి ఆఫ‌ర్ ని ఇవ్వ‌డం మొద‌టి సారి కాదు, గ‌తంలో కూడా చాలా సార్లు ఆఫ‌ర్లు ఇచ్చింది. ఈ ఆఫ‌ర్ కి డెడ్ లైన్ ని కూడా విధించింది. న‌వంబ‌ర్ 13 వ‌రకు త‌మ సాప్ట్ వేర్ విండోస్ -10 లో త‌ప్పుల‌ను క‌నిపెట్టాల్సిందిగా పెర్కోంది. 

click me!