
అద్బుత బ్యాటింగ్ తో ఇండియా అదరగొట్టింది. 600 పరుగులకు అలౌట్ అయంది. ఇక బౌలింగ్ లో కూడా టీమిండాయా బౌలర్లు విజృంభిస్తున్నారు. అద్భుతమైన బంతులతో బౌలర్లు శ్రీలంక వికేట్లు తీసి ఆకట్టుకుంటున్నారు. బ్యాటింగ్ కు అనుకూలించే పిచ్ పై టీమిండియా బౌలర్లు మ్యాజిక్ చేస్తున్నారు. మధ్యాహ్నం తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టుకు మూడవ ఓవర్లోనే షాక్ తగిలింది. మూడవ ఓవర్లలోనే ఓపెనర్ కరుణ రత్నే ను రెండు పరుగులకే ఉమేష్ యాదవ్ సూపర్ బౌలింగ్ తో పడగొట్టాడు. శ్రీలంక బ్యాట్స్ మెన్లలో అర్ధసెంచరీతో రాణించిన తరంగను 64 పరుగుల వద్ద రన్ అవుట్ చేశాడు ముకుంద్. తరువాత వచ్చిన గుణ తిలక 16 పరుగులకు అవుట్ కాగా, మెండిస్ డకౌట్ తో వెనుదిరిగారు. వీరి ఇద్దరి వికేట్లను మహ్మద్ షమీ తీశాడు. మరో బ్యాట్స్ మెన్ కం కీపర్ డిక్ వెల్లా ను ముకుంద్ అధ్భుతమైన క్యాచ్ తో పెవిలియన్ కు పంపాడు.
ఇక 150 పరుగులకు కీలకమైన ఐదు వికెట్లను శ్రీలంక కోల్పోయింది. శ్రీలంక కష్టాలలో పడింది. అర్ధసెంచరీతో శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ భారత బౌలర్లను సమర్థవంతగా ఎదుర్కొంటున్నాడు. దిల్ రువాన్ పేరేరా అతనికి సహకరిస్తున్నాడు.