అమరావతి నీడలో నిజాలు... అటెండర్లే డాక్టర్లు (వీడియో)

Published : Jul 27, 2017, 05:06 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
అమరావతి నీడలో నిజాలు... అటెండర్లే డాక్టర్లు (వీడియో)

సారాంశం

వరల్డ్ క్లాస్ సిటి అమరావతి పక్కన ఉన్న నందిగామ ఆసుపత్రిలో డాక్టర్లు లేరు అటెండర్లే డాక్టర్ అవతారమెత్తుతారు అవసరమయితే ఆపరేషన్ కూడా చేస్తారు  

 

 

 నందిగామ అనేది కృష్ణా జిల్లా లో ఒక ముఖ్యమయిన పట్టణం. గ్లోెబల్  సిటి గా రూపొందుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పక్కనే అంటే 30 కి.మీ దూరంలో ఉంటుంది. అమరావతి నీడలో ఉన్న ఈ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో అటెండర్లే డాక్టర్లు. వాళ్లే అవసరమయితే ఆపరేషన్ కూడా చేస్తారు.

ఈ నెల 23 న అనాసాగరం వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది.  పాతబెల్లంకొండవారిపాలెం గ్రామానికి చెందిన  డ్రైవర్  మెచర్ల శ్రీను కు తీవ్ర గాయాలయ్యాయి.ఆయనను నందిగామ ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా వైద్యులు లేరు. బ్లడ్ బ్యాంకు లో  అటెండర్ గా పనిచేస్తున్న వ్యక్తి డాక్టర్ అవతారమెత్తాడు.  డ్రైవర్ కు గోంతులో దిగబడిన పుల్ల ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు లేకుండా  కాలిలో గుచ్చుకున్న ముల్లు ను తీసినట్లు  దారుణంగా బయటకు తీశాడు.  డ్రైవర్ విలవిలలాడిపోయాడు. ఆ నొప్పికి తట్టుకోలేక శ్వాస  అడక ప్రాణాలు గాలిలో వదిలాడు.
వైద్యులు చేయాల్సిన పనులుస అటెండర్లు చేస్తున్న దృశ్యాలు  పై  వీడియో లో చూడవచ్చు. ఇది అమరావతి పక్కన పరిస్థితి.  అమరావతి గ్రాఫిక్స్ ఉన్నంతగా చుట్టుపక్కల జీవితం కలర్ ఫుల్ గా  లేదనేందుకు ఇది నిదర్శనం. 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !