రుపాయ మీద కూడా మోదీయే కూచుంటాడా...

Published : Jan 16, 2017, 09:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:40 PM IST
రుపాయ మీద కూడా మోదీయే కూచుంటాడా...

సారాంశం

ఉత్తర ప్రదేశ్ ఎన్నికల తర్వాత  మహాత్మాగాంధీ బొమ్మ  జాగాలలో మోదీ మహాత్ముడై కూచుంటాడని చాలా మంది అనుమానిస్తున్నారు.

ఈ అనుమానం నిజమవుతుందా?

 

స్వచ్ఛ భారత్ లోగోలో గాంధీ బొమ్మ తీసేసి  కళ్లద్దాలు మాత్రమే ఉంచారని మాజీ పశ్చిమబెంగాల్ గవర్నర్ గాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ అన్నారు. ఇది గాంధీ బొమ్మను క్రమంగా తీసేసేందుకు కుట్ర అని ఆయన అరోపించారు.

 

అదే సమయంలో మధ్య ప్రదేశ్ లో కర్నాటకలో గాంధీ బొమ్మ లేని  కొత్త పెద్ద నోట్లు బయటపడ్డాయి. ఇవేవి నకిలీవి కావు. బెంగుళూరువి అయితే,  అనేకల్ సంపంగి వద్ద ఉన్న స్టేట్ బ్యాంకు ఎటిఎం నుంచి డ్రా చేసుకున్న రు. 2వేల నోట్లే. ఇందులో బొమ్మలేకపోవడంతో ఆసామీ హాతాశుడయ్యాడు. బ్యాంకు వల్ల నడిగితే,ఏంపర్వాలే, కంగారొద్దు, అచ్చుతప్పు అని సర్దిచెపి, వాటిని వెనక్క తీసుకుని వేరే నోట్లు ఇచ్చి పంపారు.

 

తర్వాత  కేంద్ర ప్రభుత్వపరిధిలోని  ఖాదీ కమిషన్ వేసిన  2017క్యాలెండర్లో  పాత రాట్నం ముందుకు కూర్చుని  ఉన్న బికారి గాంధీ బొమ్మ తీసేసి, డాబుతో ఉన్నరాట్నం ముదు దర్జాగా కూర్చుని ఉన్న ప్రధాని మోదీ ప్రత్యక్ష మయింది. అంతే గోల గోల...

 

‘ అంత గోల ఎందుకోయ్.  ఇందులో తప్పేముంది. క్యాలెండర్ మీద  ఎవరి బొమ్మ వేయాలనేదాని మీద ఖాది కమిషన్ లో రూల్సేమి లేవు. ఇంత రాద్ధాంతం అనవసరం’ అని ప్రధాని  కార్యాలయం ఏకంగా ప్రకటనచేసింది.

 

ఇదంతా చూస్తూంటే, మెల్లిగా రుపాయ నోటు మీద ఉన్న  గాంధీ బొమ్మను తీసేస్తారా అని అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

కొందరయితే, ‘ఈ విమర్శలన్నింటిని ఉత్తర ప్రదేశ్ ఎన్నికల ముందు లేవదీసి, ఉత్తర ప్రదేశ్లో బిజెపికి వ్యతిరేకంగా పనిచేసేలా చేస్తున్నారు. అందువల్ల, రేపు ఉత్తర  ప్రదేశ్ లో మోదీ గెలిస్తే...( గెల్చేది మోదీయో, ఎందుకంటే ఎన్నికల బరువు మోస్తున్నదాయన ఒక్కరే)’

 

ఒక వేళ గెలిస్తే...

 

మహాత్ముడి కంటే మోదీ ఏ మాత్రం తక్కువ కాదని ప్రజల తీర్పు వచ్చినట్లుగా బిజెపి చెప్పుకోవచ్చని ఒక వర్గం అనుమానిస్తున్నది.

 

అపుడు, గాంధీ వేలాది మంది ఉప్పుసత్యాగ్రహంతో పేరుతో సత్యగ్రహం బాట పట్టిస్తే... మోదీ నోట్లరద్దు పేరుతో దేశ ప్రజలందరిని క్యాష్ లెష్ వైపు నడిపించాడని పోల్చవచ్చు.

 

ఖాదీ అండ్ గ్రామోద్యోగ్ కమిష న్ వారి మోదీ చర్కాకు ప్రజామోదం లభించిందని, గాంధీ పాత రాట్నంతీసేసి మోదీ రాట్నం పెట్టిన ప్రజలు  ఓటేశారని చెబుతూ..ఎక్కడెక్కడ గాంధీ, నెహ్రూ బొమ్మలు తీసేసి అక్కడ మోదీ బొమ్మలు పెట్టేందుకు కాషాయ పార్టీకి లైనెన్స్ దొరికినట్లే నని బిజెపి వాదించవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

ఖరీదయిన మోదీ కుర్తా వేసుకుని, ఖరీదయిన రాట్నం తిప్పతూ ఉన్న  బొమ్మను చూట్టానికి అసహ్యంగాఉందని, తెలంగాణా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఆంధ్ర ప్రదేశ్ ఖాదీబోర్డు మాజీ ఛెయిర్మన్ నిరజంన్ అంటున్నారు.రాట్నంతో మోదీని వూహించుకోలేకపోతున్నామని, ఈ బొమ్నని ఉపసంహరించుకుని ప్రజల మనోభావాలను మోదీ గౌరవించాలని ఆయన కోరుతున్నారు.

 

రాట్నం,గాంధీ విడదీయ రానివని, వీటిని తన పబ్లిసిటి కోసం వాడుకోవాలనుకోవడం ప్రధాని హోదాకు తగదని ఆయన అన్నారు.

 

 

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !