అనగనగా ఎనిమిది మంది మహారాజులు

Published : Jan 16, 2017, 07:40 AM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
అనగనగా ఎనిమిది మంది మహారాజులు

సారాంశం

ఎనిమిది ప్రపంచ వ్యాపార విజేతల అస్తి ఎంతో తెలుసా...

అనగనగా ఎనిమిది మంది. వాళ్లు ఏమోమోచేసి కోట్లకు పడగలెత్తి ప్రపంచ విజేత లయ్యారు.

 

చివరకు ఈ  ఎనిమిది మంది ఆస్తి ఎంత పెరిగిందంటే, భూమ్మీద ఉన్న జనాభాలో సగం అంటే  3.6 బిలియన్ లమంది  పేద వాళ్ల ఆస్తులకన్నీ కలిపితే గాని... అంత కాదు.

 

 స్విజర్లాండ్ లోని దావాస్ లో ఏటాజరిగే కార్పొరేట్ సంస్థల క్లబ్ (వరల్డ్ ఎకనమిక్ పోరం) వార్షిక సమావేశం సందర్భంగా ఆక్ష్ ఫామ్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం పేర్కొన్నారు.

 

ఈ ఎనిమిది మంది ఇంకా ఆస్తులు పెరుగుతున్నాయి.   ఈ  ఎనిమిది మంది అస్తుల విలువ $ 426 బిలియన్లు.

 

20011 అక్టోబర్ 31 నాటికి ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచ జనాభా7 బిలియన్లు.  అంటే  ఈ ఏనిమిది మంది  సంపన్నుల  ఆస్తి ప్రపంచంలో సగానికి పైగా జనాభాకున్నంత ఆస్తి అన్నమాట.

 

టెక్నాలజీని అలవాటు పర్చుకుంటే పేదరికంపొతుదని చంద్రబాబు నాయుడు లాంటి విజ్ఞులు ఆశిస్తున్న సమయంలో ఇలా జరగుతూ ఉండటం ఆశ్యర్యం.

 

సంపన్నుల కు, పేదవారికి మధ్య వ్యత్యాసం పెరిగిపోతూ ఉందని  అక్స్ ఫాం వ్యాఖ్యానించింది. ఈ అసమానతకు కారణం... వేతనాలు పెరగకుండా కళ్లెం వేయడం, పన్నులు ఎగ్గొట్టడం, పనిచేసేవారిని కంపెనీలు పీల్చిపిప్పిచేయడంతో పాటు కంపెనీలకు, వాటిలో పనిచేసే ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ లకు ఎక్కల ఆదాయం చేకూర్చడం మీద దృష్టి నిలపడం దీనికి కారణమట.  ఈ ఎనిమిది సంపన్నులెవరో తెలుసా : బిల్ గేట్స్, ఎమాన్సియో ఒర్టెగా (స్పెయిన్), వారెన్ బఫెట్ (యుస్),కార్లోస్ స్లిమ్ హేలూ(మెక్సికో), జెఫ్ బెజోస్(అమెజాన్) మార్క్ జెకెర్ బర్గ్(ఫేస్ బుక్),లారి ఎలిసన్ (ఒరాకిల్), మైఖేల్ బ్లూమ్ బర్గ్(బ్లూమ్ బెర్గ్)

 

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !