చట్టప్రకారం ఎన్నికల్లో పోటీకి పవన్ అనర్హుడయ్యాడా..!

Published : May 09, 2017, 11:06 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
చట్టప్రకారం ఎన్నికల్లో పోటీకి పవన్ అనర్హుడయ్యాడా..!

సారాంశం

పవన్ కు పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత ఉందేమో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం అర్హత లేకుండా పోయింది.

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓ బలమైన నేత.

 

అతను చిటికేస్తే లక్షల మంది ఆయన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మద్దతిస్తే ఉన్న పార్టీని వదిలేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు క్యూ లో ఉన్నారు.వచ్చే ఎన్నికల్లో పవన్ జనసేన డిసైండింగ్ ఫ్యాక్టర్ గా ఉండనుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంగీకరిస్తున్నారు.

 

ఇక పవన్ 2019 ఎన్నికల్లో పోటీయే లక్ష్యంగా పార్టీ పటిష్టత కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.అభ్యర్థుల ఎంపిక విషయంలో పరీక్షలు పెట్టి మరీ సభ్యత్వం ఇస్తున్నారు.

 

ఇక జనసేన అధినేత గా పవన్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని ఇంకా నిర్ణయం కాలేదు.

 

అయితే ఆయన పార్లమెంట్ లేదా అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసేందుకు అర్హత ఉందేమో కానీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాత్రం అర్హత లేకుండా పోయింది. అయినా పవర్ స్టార్ మరీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తారు...? ఆయన స్థాయికి అది చాలా... చాలా తక్కువ అని అనుకోవచ్చు. నిజంగా అందులో తప్పేమీ లేదు.

 

కానీ, పవన్ సాంకేతికంగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అర్హత లేకుండాపోయింది.ఎందుకంటే, 1995లో ఉమ్మడి ఏపీలో తెచ్చిన చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఇద్దరికి మించి సంతానం ఉండకూడదు.

 

కానీ, పవన్ కు ఇప్పుడు ముగ్గరు సంతానం. మరోసారి ఆయన తండ్రి కాబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అంటే పవన్ ఓ పార్టీకి అధినేత, పవర్ ఫుల్ పోజియన్ లో ఉన్నా కూడా కనీసం సర్పంచ్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి అర్హత లేకుండా పోయిందన్నమాట.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !