టిడిపి ఎమ్మెల్యే శివాజీకి గుండెపోటు

First Published May 9, 2017, 8:23 AM IST
Highlights

 శ్రీకాకుళం జిల్లా పలాస తెలుగు దేశం సీనియర్  ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ సోమవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యారు. 

 ఆయన్ని హుటాహుటిన విశాఖపట్ణణంలోని ని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. కేర్‌ వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. 

 తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు,  శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్‌ సుందర్‌ శివాజీ సోమవారం అర్ధరాత్రి గుండెపోటుకు గురయ్యారు.

దీంతో ఆయన్ని హుటాహుటిన విశాఖపట్టణంలోన=ని కేర్‌ ఆసుపత్రికి తరలించారు.

కేర్‌ వైద్యులు ప్రత్యేక వార్డులో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా ఆయన గుండెపోటుకు గురయ్యారు.

శివాజీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

 

ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు గౌతు లచ్చన్నకుమారుడు ఆయన.

 

ఇటీవల క్యాబినెట్ విస్తరణ సందర్భంగా మంత్రి వర్గం ఆశించిన వారిలో శివాజీ ఒకరు.  మంత్రి పదవి రాకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యం క్షిణిస్తూ వచ్చిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

 

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలోకి వెళుతున్నపుడు పోలీసుల అడ్డుకున్నారని నిరసన వ్యక్తం చేస్తూ రెండు సార్లు ఆయన ధర్నా కూడా చేశారు. నియోజకవర్గం కోసం, ప్రజలకోసం బాగా కష్టపడతాడని కూడా ఆయనకు పేరుంది.

click me!