
ఉత్తరాఖండ్ నుంచి కన్యాకుమారి దాకా ఇపుడ బాగా వినిపించే మాట బాహుబలి. మొత్తానికి బాహుబలి చూడకుండా ఎలా ఉండాలనేంత తపన సృష్టించడంలో చిత్రనిర్మాతలు విజయవంతమయ్యారు. చూడాలనుకోవడమే కాదు, మరొకరికి చూపించడం కూడా జరుగుతూఉంది.
తెలంగాణా రాజన్నసిరిసిల్ల జిల్లా జాయింట్ కలెక్టర్ బాహుబలి సినిమా అనాథబాలకు చూపించి వినోదం విజ్ఞానం అందించారు.
సోమవారంనాడు జాయింట్ కలెక్టర్ యాస్మిన్ బాషా బహుబలి-2సినిమాను పట్టణంలోని నటరాజ ధియోటర్ లో 37 మంది అనాధబాలలకు చూపించారు.
ఇక్కడి రంగినేని చారిటబుల్ ట్రస్టులోని ఈ అనాథ విద్యార్థులతో కలిసి జాయింట్ కలెక్టర్ ఈ సినిమాను వీక్షించారు. ఈ పిల్లలకు సినిమా చూడడం వంటి సరదా తీరడం చాలా కష్టం. అందువల్ల జాయింట్ కలెక్టర్ అనాధశరణాలయం సందర్శించి వారికిసినిమా గురించి, అందులో వాడిన గ్రాపిక్స్ గురించి వివరించి, తాను స్వయంగా వారి మధ్య కూర్చుని సినిమా చూశారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ ఈ సినిమా చూసి పిల్లలు చాలా అనందించారని చెప్పారు.
పిల్లలు కుటుంబాలతో, స్నేహితులతోకలసి సినిమా చూస్తుంటారు. బాహువలి గొప్ప చిత్రంగా పేరుపొంది, చర్చనీయాంశమయినందున ఇలాంటి సినిమా చూడలేకపోయామన్న వెలితి ఈపిల్లలలో ఉండకూడదని వారిని సినిమాకు తీసుకెళ్లినట్లు ఆమె చెప్పారు.