అద్వానీని ఎందుకు కూర్చోబెడుతున్నారు ?

First Published Jan 8, 2017, 4:43 AM IST
Highlights

మొన్నటి పార్లమెంట్ సమావేశాల దగ్గర నుండి వేదికలపై అద్వానీకి కూడా చోటు కల్పిస్తుండటం ఆశ్చర్యంగా ఉంది.

భారతీయ జనతా పార్టీ నాయకత్వం పార్టీ కరువృద్ధుడు ఎల్ కె అద్వానీని కూరల్లో కరివేపాకు లాగ వాడుకుంటున్నట్లు కనబడుతోంది. నరేంద్రమోడి ప్రధానమంత్రి అయిన దగ్గర నుండి పార్టీలోని వృద్ధతరం నేతలను చాప చుట్టినట్లు చుట్టి మూలకు పడేసారు.

 

గడచిన రెండున్నేళ్ళలో జరిగిన ఏ కార్యవర్గ సమావేశంలో కూడా వృద్ధ నాయకత్వాన్ని దగ్గరకు చేర్చలేదు. వారి మాటలకు ఏమాత్రం విలుద ఇవ్వలేదు. ఈ విషయమై ఎన్నిమార్లు పార్టీలోని ఎల్ కె అద్వానీ వంటి నేతల మద్దతుదారులు ప్రస్తావించినా ఏమాత్రం ఖాతరు చేయలేదు.

 

అటువంటిది మొన్నటి పార్లమెంట్ సమావేశాల దగ్గర నుండి వేదికలపై అద్వానీకి కూడా చోటు కల్పిస్తుండటం ఆశ్చర్యంగా ఉంది. తరచి చూస్తే పెద్ద నోట్ల రద్దు తర్వాత తలెత్తిన వ్యతిరేకతే కారణంగా తోస్తోంది. ఏదో సొల్లు కబర్లు చెప్పి నవంబర్ 8వ తేదీ రాత్రి పెద్ద నోట్లను మోడి హటాత్తుగా రద్దు చేసారు. దాంతో దేశవ్యాప్తంగా గందరగోళం మొదలైంది.

 

నోట్ల రద్దు ప్రభావంతో దేశ ఆర్ధిక వ్యవస్ధే కుదేలైపోయింది. యావత్ దేశజనమంతా గడచిన రెండు నెలలుగా తామకు ఇంకే పనీలేనట్లుగా బ్యాంకులు, ఏటిఎంల చుట్టూనే తిరుగుతున్నారు. అంతేకాకుండా మోడి చర్యపై దేశప్రజలు మండిపడుతున్నారు.

 

వాస్తవం ఇలాగుంటే, శనివారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో మాత్రం మోడి భజన అద్భుతంగా జరిగింది. పేరుకే కార్యవర్గ సమావేశం గానీ మాట్లాడింది మోడి కాకుండా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ధిక మంత్రులు అరుణ్ జైట్లీ, నిర్మలా సీతారామన్ మాత్రమే.

 

దాంతో కార్యవర్గ సమావేశంలో ఎప్పటి లాగే మోడి భజన అదుర్స్. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే అద్వానీని కూడా వేదికపై కూర్చోబెట్టటం. ఏదో  కూర్చోబెట్టారే గానీ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేకనుకోండి అది వేరే విషయం.

 

ఇంతకీ అద్వానీని ఎందుకు కూర్చోబెట్టారన్న విషయం మాత్రం ఎవరూ చెప్పలేదు. కార్యవర్గంలో ఎవరైనా నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మాట్లాడితే వారిని సముదాయించటానికి ముందుజాగ్రత్తగా అద్వానీని కూర్చోబెట్టారేమో అని అనుకుంటున్నారు.  

 

అయితే, మోడి, అమిత్ షాలను ఎవరైనా  నోట్ల రద్దు సమస్యలపై నిలదీస్తే అద్వానీ ప్రధానికి మద్దతుగా నిలుస్తారన్నది ఒట్టి భ్రమే. ఎందుకంటే, నోట్ల రద్దుపై ఇప్పటి వరకూ వ్యతిరేకంగా మాట్లాడిన భాజపా నేతల్లో ఎక్కువమంది అద్వానీ మద్దతుదారులే అన్న విషమం మరచిపోకూడదు.

 

కార్యవర్గం కాబట్టి ఏం మాట్లాడుకున్నా సరిపోతుంది. నిజంగానే నోట్ల రద్దు అద్భుతమైతే మరి, పార్లమెంట్ లో దేశభక్త ఎందుకు మాట్లాడలేదో?

click me!