
ఖైదీ నెంబర్ 150 సినిమా వేడుకలో చిరంజీవి స్పీచ్ కంటే నాగుబాబు పేల్చిన బాంబులే ఎక్కువ హైలెట్ అయ్యాయి.
మెగా ఫ్యామిలీ మీద గతంలో వివిధ కామెంట్లు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మ, రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పై బుసకొట్టారు నాగుబాబు. వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
చరణ్ ముఖం మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాడంటూ ఒక వ్యక్తి గతంలో కామెంట్ చేశారని ఆయన తమ కుటుంబానికి సన్నిహితుడని, చిరంజీవి సినిమాలకు దర్శకత్వం వహించాడని.. వ్యక్తిత్వ వికాస క్లాసులు చెబుతాడని పరోక్షంగా యండమూరిపై ధ్వజమెత్తారు.
ఓ వ్యక్తి కి ఇక్కడ డైరెక్షన్ చేతకాక ముంబై వెళ్లిపోయి అక్కడి నుంచి సోషల్ మీడియాలో పిచ్చి కూతలు కూస్తున్నాడని వర్మ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో మెగా ఫ్యామిలీపై కామెంట్లు చేసిన ఇద్దరిని ఇలా నాగుబాబు పౌరుష పదజాలంతో దూషించడం అక్కడికి వచ్చిన అభిమానులను సైతం షాక్ కు గురిచేసింది.