చంద్రబాబును ఏకాంతంగా కలవడం ప్రధాని మోదీకి ఇష్టం లేదా?

First Published Jul 3, 2017, 11:11 AM IST
Highlights

ముందు ముందు రాజకీయ ఇబ్బందులున్నాయని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అనుమానిస్తున్నట్లున్నారు. ఈ భయాన్ని ఆయన కూడా ఎక్కడో ఒక చోట ఎవరితో ఒకరితో చెప్పుకుని ఒదార్పు పొందాలి కదా. టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులకు ఇబ్బందులొస్తే పార్టీ అధ్యక్షుడికి చెప్పుకుంటారు. మరి పార్టీ అధ్యక్షుడికే ఇబ్బందులొస్తే...

ముందు ముందు రాజకీయ ఇబ్బందులున్నాయని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అనుమానిస్తున్నట్లున్నారు. ఈ భయాన్ని ఆయన కూడా ఎక్కడో ఒక చోట చెప్పుకుని ఒదార్పు పొందాలి కదా. టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నాయకులకు ఇబ్బందులొస్తే పార్టీ అధ్యక్షుడికి చెప్పుకుంటారు. మరి పార్టీ అధ్యక్షుడికే ఇబ్బందులొస్తే...

 

చంద్రబాబు నాయుడు తన సమస్యను ప్రధాని నరేంద్రమోదీతో చెప్పుకుని  బరువు దించుకోవాలనుకుంటున్నారు. అయితే, మోదీ ఏమో బాబును కలవడానికే ఇష్టపడటం లేదు. గుంపులో కలవడం, పరసర్పరం పొగడుకోవడానికి తప్ప, ముఖాముఖి కలవడానికి చంద్రబాబు నాయుడికి ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. తానుఎన్డీయే భాగస్వామి అయినా కూడా ,తనకు శత్రువయిన వైసిపి నేత జగన్మోహన్ రెడ్డికి రోజురోజుకు బిజెపి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నది. మొన్నామధ్య  జగన్ ఎన్డీయే రాష్ట్ర పతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ కు  మద్దతు ప్రకటిస్తే బిజెపి వాళ్లు గొప్పగా చెప్పుకున్నారు. అంతేకాదు, నామినేషన్ ఫాం మీద సంతకం చేయమని  వైసిపి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ విషయమేదో ఒక సారిప్రధాని మోదీతో ఏకాంతంగా చర్చించాలనుకుంటున్నా, ప్రధాని అవకాశం మీయడం లేదని దక్కన్ క్రానికల్ రాసింది.

 

ఏదో విధంగా ఎక్కడో ఒక చోట కలసి, ‘ఏకాంతంగా కలుద్దామా’ అని అడగాలనుకుంటున్నాడు. ఇచ్చిన శాలువను చక్కగా స్వీకరించడం తప్ప, ట్రంప్ ను కౌగిలించుకున్నట్లు కౌగిలించుకుని,టీ తాగుదాం పదండని నాయుడుగారిని  మోదీ పిలువడమే లేదు.

 

తాజా గా  అహ్మదాబాద్ లో ముఖ్యమంత్రి మరొక ప్రయత్నం చేశారు.గత వారం అహ్మదాబాద్ లో అహ్మదాబాద్ లో జరిగిన టెక్స్ టైల్ ఇండియా సమిట్ జరిగింది. దీనికి అన్ని  రాష్ట్రాలు చేనేత శాఖల మంత్రులనే పంపించాయి. ప్రధాని హాజరవడం తప్పించి అందులో ప్రాధాన్యత లేకపోవడమే, ప్రత్యేక ఆహ్వానం ఉన్నా, ముఖ్యమంత్రులెవరూ రాలేదు. గుజరాత్ ముఖ్యమంత్రి కి తప్పదు. ఇక అదనంగా వచ్చింది కేరళ  ముఖ్యమంత్రి మాత్రమే.

తెలంగాణ ప్రభుత్వం తరపున ఆ శాఖ  మంత్రి కెటిఆర్ మాత్రమే  హాజరయ్యారు. ఎపి తరపున మంత్రి అచ్చెన్నాయుడు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని చివరి క్షణంలో చంద్రబాబు స్వయంగా వెళ్లాలనుకున్నారు.

 

కారణం, వీలైతే అహ్మదాబాద్ లో  మోదీని ఏకాంతంగా కలవొచ్చని ఆశ.

 

కాని అక్కడ కూడా అది సాధ్యపడలేదు.

 

 రోజూ కలిసే ప్రధానే అయినా చంద్రబాబు చక్కటి శాలువతో,జ్ఞాపికితో వెళ్లారు. అంతేకాదు, సమిట్ లోమా  ఎనిమిది కోట్ల వ్యయం చేసి స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ దీనికి హర్షం వ్యక్తం చేశారు. తర్వాత నాయుడు కప్పిన శాలువను,జ్ఞాపికనుస్వీకరించారు. కాని, ప్రతిఫలంగా  ఏకాంత సమావేశానికి అవకాశమీయలేదు.

 

click me!