అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ టెకీ దుర్మరణం

Published : Jul 03, 2017, 09:47 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ టెకీ దుర్మరణం

సారాంశం

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న పోత్నక్‌ ప్రదీప్‌ (28) ఒక రోడ్డు ప్రమాదంలో ఆదివారం నాడు దుర్మరణం చెందాడు. డెల్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న ప్రదీప్ పుట్టిన రోజు వేడుకలో ఉన్నపుడు ఈ విషాదం జరిగింది.

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న పోత్నక్‌ ప్రదీప్‌ (28) ఒక రోడ్డు ప్రమాదంలో ఆదివారం నాడు దుర్మరణం చెందాడు. డెల్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పని చేస్తున్న ప్రదీప్ పుట్టిన రోజు వేడుకలో ఉన్నపుడు విషాదం జరిగింది.  ప్రదీప్  తెలంగాణా యాదాద్రి-భువనగిరి జిల్లా భువనగిరి పట్టణానికి చెందినవాడు.  ప్రదీప్ తన బర్త్ డే వేడుకలు జరుపుకోవడానికి తన భార్య కీర్తన చంటి తో సహా ఎనిమిది మందితో కలిసి విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్నపుడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ప్రమాదంలో భార్య కీర్తన మరొక నలుగురు కూడా గాయపడ్డారు. వారంతా వెస్ట్ వర్జీనియాలోని సట్టన్ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు.

 

మార్గ మధ్యంలో వారి కారు భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7 గంటలపుడు అదుపుతప్పి లోయలో పడిపోయింది.  ఈ ప్రమాదంలో ప్రదీప్ చనిపోయాడు. ఈ విషయాన్ని డెల్ సంస్థ ప్రతినిధులు అదివారం రాత్రి కుటుంబ సభ్యులకు తెలియచేశారు.

నిజానికి, తన విహార యాత్ర ఫోటోలను కూడా ప్రదీప్ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. పోస్టులో #CampingTime #LongWeekEnd #Friends అని కూడా రాశాడు.

PREV
click me!

Recommended Stories

నేను ఇండియాకి వస్తున్నా: Cockroach Janta Party Founder Abhijeet Dipke To Return To India
ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu