ఈ టిడిపి పండగ ప్రజల పండగ కాలేకపోతున్నది

First Published Jul 3, 2017, 10:09 AM IST
Highlights

తెలుగుదేశం ప్రభుత్వం ఒక కొత్త పండగ జరుపుకోవాలనుకుంది. పట్టిసీమ గోదావరి  జలాలు ఒక్కొక్క వూరిలో  రాగానే అక్కడి టిడిపి నాయకులతో పూజలు చేయిస్తున్నారు. ఈ నీళ్లకు ప్రజలు పోలో మని వచ్చి పుష్కరాల మాదిరి పండగ జరగుతుందని ఆశపడ్డారు. అయయితే, ఇది ప్రజలపండుగ కాలేకపోతున్నది. కేవలం,టిడిపి మంత్రులు, పదవుల్లో ఉన్న వారు, పదవులు ఆశిస్తున్నావారు చేస్తున్న అట్టహాసంగా కనిపిస్తుంది.

 

పట్టిసీమ నుంచి గోదావరి జిలాలను కృష్ణా డెల్టాకు విడుదల చేయడాన్ని పండుగా తయారుచేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. గత వారం ఈ నీటిని విడుదలచేస్తూ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ  భారీగా పూజలు చేశారు. తర్వాతచాలా మంది తెలుగుదేశం నాయకుడుపూజలు చేశారు. ఇపుడు ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా  ‘కృష్ణా జిల్లా: రైతులు బాగుండాలి, పంటలు బాగా పండాలి, రాష్ట్రం పచ్చగా ఉండాలి, జలసిరితో కనులపండుగ కావాలి, ’ అనే నినాదాల మధ్య పూజలు గోదావరి-కృష్ణా నదులకు పూజ చేశారు. గత ఏడాది  ముఖ్యమంత్రి పట్టిసీమనుంచి గోదావరి జిలాలు కృష్ణాడెల్లాలోకి విడుదల చేశారు.

 

ఒక్కొక్క ప్రాంతానికి గోదావరి  జలాలు రాగానే అక్కడి టిడిపి నాయకులతో పూజలు చేయిస్తున్నారు. అయితే, ఇవేవి ప్రజలపండుగ కాలేదు, కేవలం,టిడిపి మంత్రులు పదవుల్లో ఉన్న వారు, పదవులు ఆశిస్తున్నావారు చేస్తున్న అట్టహాసంగా కనిపిస్తుంది.

 

పట్టిసీమ ద్వారా వచ్చిన గోదావరి జలాలు కైకలూరు నియోజకవర్గంలో ప్రవేశించిన సందర్భం పురస్కరించుకొని సోమవారం కైకలూరు మండలం విజరం లాకూలు పోల్ రాజ్ కెనాల్ వద్ద గోదావరి జలాలకు మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే జయమంగళం ప్రత్యేక పూజలు చేశారు.


గత పదేళ్ల కాలంలో తొలిసారిగా జూలై నెల ప్రారంభానికే కృష్ణా డెల్టాకు సాగునీరిచ్చిన ఘనత చంద్రబాబునాయుడుకి దక్కుతుందని వారు కొనియాడారు.


నదుల అనుసందానం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలన్న సంకల్పం ఉన్న ముఖ్యమంత్రి అపర భగీరధుడని మంత్రి కామినేని శ్రీనివాస్ కొనియాడారు

 

నిన్న గోదావరి జలాలు బ౦దరు మ౦డలానికి విచ్చేస్తున్న స౦దర్భ౦గా బ౦దర్ మ౦డల౦, యస్.ఎన్. గొల్లపాలె౦ కి బై కుల మీద  ర్యాలీ గా బయలుదేరి వెళ్ళి హరతి ఇచ్చి స్వాగత౦ మ౦త్రి శ్రీ కొల్లు రవీ౦ద్ర ,  పార్లమె౦ట్ సభ్యులు శ్రీ కొనకళ్ళ నారాయణ రావు గారుస్వాగతం పలికారు. నీళ్లలో దిగి పూజలు చేశారు (కిందిఫోటో)

 

click me!