ఈ అకున్ సభర్వాల్ ఎవరబ్బా, హీరోల మొఖమ్మీది మాస్క్ లాగేశాడు

First Published Jul 14, 2017, 5:08 PM IST
Highlights
  • ఒక వారం రోజులుగా హైదరాబాద్ మీడియాలో వినపడుతున్న మాటలు రెండే అకున్ సభర్వాల్ ఐపిఎస్, డ్రగ్స్
  • సినిమాపెద్దోళ్ల మొఖాల మీద మాస్క్ లాగేసి వాళ్లను బజారు కీడ్చేశాడు
  • పెదోళ్ల పిల్లలు స్కూళ్లలో డ్రగ్స్ ఎలా తింటున్నారో చూపాడు
  • రగడ ఎక్కువయ్యే సరికి ఇపుడు శెలవు మీద వెళ్లాల్సి వచ్చింది

గత వారంలో రోజులుగా తెలంగాణా  మీడియాలో కనిపిస్తున్న, వినిపిస్తున్న పేర్లు రెండే - డ్రగ్స్, అకున్ సభర్వాల్.  ఆయన తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కార్యదర్శి స్మితా సభర్వాల్ భర్త. ఐపిఎస్ ఆఫీసర్ అయిన అకున్ మొన్నమొన్నటి దాకా లా అండ్ అర్డర్ లో డిఐజి గా ఉన్నారు. తర్వాత ఆయన బదిలీలో ఎక్సయిజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ గా వచ్చిపడ్డారు. అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు.

ఒక దెబ్బతో  తెలుగు సినిమా రంగంలో బలిసి నోళ్లందరి బట్టలూడదీశాడు. డ్రగ్స్ మత్తులో తూగుతున్నవాళ్ల మొఖాల మీది మాస్కులు తీసేశాడు.  తీరా చూస్తేవాళ్లలో  హీరోలున్నారు, డైరెక్టర్లున్నారు, హీరోయిన్లున్నారు. ఈ   తాగుడు జోగుడు  చాలా కాలంగా నడుస్తున్నా. సినిమా డ్రగ్ తీగె లాగింది అకునే.డ్రగ్స్ పైన కన్నెసి  పెద్దింటి బిడ్డల పాఠశాలలో, సినిమా రంగంలో డ్రగ్స్ రాజ్యం ఏ స్థాయిలో ఉందో వెలికితీశారు.డ్రగ్స్ వినియోగిస్తున్న సినిమా ప్రముఖుల పేర్లను లీక్ లద్వారా రోడ్డు కీడ్చారు.

2001 బ్యాచ్ ఐపిఎస్ ఆఫీసరాయన.

మొదట అస్పాం కేడర్ కు ఎంపికయ్యారు. తన బ్యాచ్ మెట్ అయిన స్మిత్ సబర్వాల్ (ఐఎఎస్) ను పెళ్లి చేసుకున్నందున  అకున్ ఆంధ్రప్రదేశ్ కేడర్ కు మారారు. నిజానికి ఆయన పటియాల డెంటల్ కాలేజీలో బిడిఎస్ చదివారు. అక్కడ ఇంటర్న్ గా ఉన్నపుడే సివిల్స్ రాశారు. పాస్ అయ్యారు. అస్పాం కేడర్ కు కేటాయించబడ్డారు.

అనంతపురంలో మొదటి పోస్టింగ్. అక్కడా  ఆయన ఫ్యాక్షనిస్టుల వెంటపడ్డారు.అక్కడి నుంచి వరంగల్ ఓఎస్డిగా వచ్చారు.  ఆ తర్వాత విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేశారు. ఆయన  ఎస్పీగా ఉన్నపుడే జిల్లాలో ఏకంగా 28 సార్లు పోలీసులు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని చెబుతారు. విశాఖనుంచి  హైదరాబాద్ కు వచ్చిన డీసీపీగా పనిచేశారు.  ఆతర్వాత హైదరాబాద్ రేంజ్ డిఐజిగా పనిచేశారు. తర్వాత ఆయన్నిముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్ కు ఎక్సైజ్ శాఖకు తీసుకువచ్చారు.అకున్ 1976,డిసెంబర్ 4న లో పాటియాలాలో జన్మించారు.ఆర్మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.

అయితే, అకున్ స్పీడ్ ప్రభుత్వంలో ఎవరికో నచ్చలేదు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి తరలివెళ్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. రాష్ట్రం వచ్చాక  టిఆర్ఎస్ ప్రభుత్వం సినీ పెద్దలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. దీంతో సర్కారు అండదండలుంటాయని నమ్మిన సినీ పెద్దలు ఇక్కడే స్థిరంగా ఉంటామని కూడా పలుమార్లు స్పష్టం చేశారు. గతంలో టిఆర్ ఎస్ నాయకులు ద్వేషించిన వారంత ఇపుడు స్నేహితులయ్యారు. ఈ నేపథ్యంలో గుట్టుగా డ్రగ్స్ తింటున్న సినిమా వాళ్ల పేర్లను లీక్ చేయడం ఏలినవారికి నచ్చినట్లు లేదు. స్నేహబంధం బలహీనపడేలా ఎవరూ పనిచేయకూడదుగా... అంతే, అకున్ లీవు మీద వెళ్లాడు.

click me!