పవన్ గూటికి మాజీ సిఎం కిరణ్ ?

Published : Jul 14, 2017, 02:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
పవన్ గూటికి మాజీ సిఎం కిరణ్ ?

సారాంశం

మూడేళ్లుగా పార్టీ లేక కిరణ్ కుమార్ రెడ్డి విలవల్లాడుతుండాలి  రాష్ట్ర విభజన తర్వాత ఆయన  పార్టీలకు దూరమయ్యారు తొందర్లో ఒక పార్టీ వాడవుతానని ఆ మధ్య ప్రకటించారుగాని జరగలేదు ఇపుడు తాజాగా జనసేన పిలిపందుకున్నారని రూమర్ 

మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక రాజకీయ  పార్టీ వాడవుతున్నాడా? ఆయనకు జనసేన నుంచి ఆహ్వానం వచ్చిందని, ఆయనకు పార్టీలో సెకండ్ ఇన్ కమాండ్ బాధ్యతలు ఇవ్వాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నాడని ఇపుడొక వదంతి మీడియా సర్కిల్స్ లో  గుప్ మంది.

చాలా కాలంగా ఒక పిలుపుకోసం కిరణ్ కుమార్ రెడ్డి ఎదురు చూస్తున్నమాట నిజమే. 2014 లో పోటీచేయకుండా పరాభవం నుంచి తప్పించుకున్నా, రాజకీయ పరాభవాలు ఆయనకు తప్పలేదు. మోదీ గాలి చూసి బిజెపిలోకి దూరే ప్రయత్నం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అనే టైటిల్ బాగా పనికొస్తుందని ఆయన  అనుకున్నట్లుంది. అయితే, కులం అడ్డొచ్చింది. రాయలసీమ రెడ్లంతా సందు దొరికితే బిజెపిలో చేరి పెత్తనం ఛెలాయించే ప్రమాదం ఉందని ఒక బిజెపి కమ్మ నాయకుడు కిరణ్ రాకుండా మోకాలడ్డినట్లు చెబుతారు.  దానికి తోడు కిరణ్ ఒక ‘రెడ్డి’ నాయకుడిగా ఎదగ లేకపోయారు. రాయలసీమలో చిన్నోడయినా పెద్దోడయినా, రెడ్డంటే,  పది మందిపోగేసుకుని నాయకుడిగా ఛలామణి అవుతూ జనం మధ్యే తిరుగుతూ ఉండాలి. పదవి ఉన్నా లేకపోయినా,ఖద్దరేసుకుని హైదరాబాద్ లోకనబడుతు ఉండాలి. హైవేలో ఝామ్మని తిరుగుతుండారు. మాట్లాడుతూ ఉండాలి,కాట్లాడుతూ కనిపించాలి. ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇలా ఎదగలేదు. ఆయనకు రెడ్ల మధ్యే పేరు లేదు. అందువల్ల బిజెపి వాళ్లు, ‘ ఆయన పార్టీలో చేరితో వచ్చేదేమీ లేదు’ అని కూడా కనక్కున్నారట.

దీనితో ఆయన క్రికెట్ మ్యాచ్ లు చూస్తూ, పొద్దున సాయంకాలం వాక్ చేస్తూ, అపుడపుడు టెన్నిస్ ఆడుతూ, వీలున్నపుడల్లా  హైదరాబాద్, బెంగుళూరు మధ్య తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని చూసినోళ్లు చెబుతున్నారు.

 తర్వాత, తొందర్లో ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటానని చిత్తూరు జిల్లా గుర్రం కొండ గ్రామంలో ఆ మధ్య  ప్రకటించారు.అది జస్టిస్ సోమయాజులు కమిషన్ నివేదిక లాగా అతీగతీ లేకుండా పోయింది. లేదు బాస్,  ఆయన విభజన నేపథ్యంగా ‘ ముఖ్యమంత్రి జ్ఞాపకాలు‘  రాస్తున్నాడని కొందరన్నారు. చిన్న వయసులో పెద్ద వాడయి పోతే, పదవి పోయాక ఎన్నికష్టాలుంటాయో చెప్పేందుకు కిరణ్ ఉదాహరణ. 

ఇపుడు హఠాత్తుగా కిరణ్ , పవన్ కలుస్తారని వార్త వచ్చింది. 

ఇదెంతవరకు నిజమో కాని, కిరణ్ మీద కంటే, పవన్ రాజకీయాల మీదే ఈ దెబ్బతో అనుమానాలొస్తాయి. సమాసమాజం, మార్పు, ఇజం, ఇలా ఏవేవో చెప్పి, చివరకు కిరణ్ కుమార్ రెడ్డిని తీసుకుంటే... జనసేన పుట్టీ బట్టకట్టక ముందే ప్రజారాజ్యం బాట పడుతున్నదనుకోవాలి.

ఏవేవో పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూలు జరిపి జనసైనికులను రిక్రూట్ చేసుకుని,  కిరణ్ కుమార్ రెడ్డి వంటి మాజీ ముఖ్యమంత్రి చేతిలో పెడతారా?

కాబట్టి, పవన్ ఆశయాలేమిటి, చెప్పిందేమిటి, చేస్తున్నదేమిటి అనే ప్రశ్నలొస్తాయి.

ఇది ప్రస్తుతానికి రూమరే అనుకోవాలి.

మరి కిరణ్ కుమార్ రెడ్డి కూడా రిక్రూట్ మెంటు ప్రాసెస్ లో  సెలెక్టయ్యారా... అపుడెవరేం చేయలేరు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !