
భారత్ ప్రయోగించిన ఉపగ్రహం ఎక్కడ పడుతుందోనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తచేస్తున్నారు. అందుకు కారణం గత నెల 31న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 'ఇస్రో' ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1హెచ్ ఉపగ్రహమే. ఆ ఉపగ్రహాం విఫలమైన సంగతి అందరికి తెలిసిందే. ప్రస్తుతం అది రోదసిలో కొట్టుమిట్టాడుతోంది. మరో 40 లేదా 50 రోజుల్లో అది భూ వాతావరణంలోకి ప్రవేశించనుందని తెలుస్తోంది.
ఆ ఉపగ్రహాం ప్రస్తుతం అత్యంత వేగంగా భూమివైపుకు దూసుకొస్తుంది. భూ ఉపరితలంలోకి వచ్చిన సమయంలో అది పేలిపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ అది పేలిపోతే దాని శకలాలు ఎక్కడ పడతాయనే విషయం కూడా శాస్త్రవేత్తలకు అంతుచిక్కడం లేదంటున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అయితే, భూ వాతావరణంలోకి రాకముందే విచ్చిన్నం అవుతుందని భయపడాల్సిన అవసరం లేదని కొందరు ఇస్రో శాస్తవేత్తలు చెబుతున్నారు.
మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి...