మరింత ఆకర్షణీయంగా విశాఖ.. త్వరలో అతి పెద్ద రోప్ వే

First Published Sep 6, 2017, 11:36 AM IST
Highlights
  • మరింత  ఆకర్షణీయంగా మారనున్న విశాఖ
  • పర్యాటకులను ఆకట్టుకునేందుకు సన్నాహాలు
  • అతి పెద్ద రోప్ వే నిర్మాణానికి సన్నాహాలు

ఆంద్రప్రదేశ్ ఆర్థిక రాజధాని అయిన విశాఖ.. పర్యాటక రంగాన్ని ఆకర్షిస్తోంది. ఇప్పటికే.. ఇక్కడ సాగర తీరాన్ని, ఇతర ప్రాంతాలను చూసేందుకు దేశ , విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తుంటారు. కాగా.. ఈ నగరాన్ని మరింతగా  ఆకట్టుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పర్యాటకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కొత్తగా ప్రాజెక్టుల రూపకల్పన చేస్తున్నారు.

ఇందులో భాగంగా కొత్తగా ఒక రోప్ వే  ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు, వుడా( విశాఖ పట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ), జీవీఎంసీ( గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ ఆఫీస్), ఏపీటీడీసీ( ఏపీ టూరిజం డిపార్ట్ మెంట్ కార్పొరేషన్) సంయుక్తంగా... రోప్ వే ఏర్పాటుకు రెండు సరైన ప్రాంతాలను ఎంపిక చేశారు. కైలాసగిరి నుంచి సింహాచలం వరకు ఒక రోప్ వే, కైలాసగిరి నుంచి డాల్పిన్ నోస్ వరకు మరో రోప్ వే నిర్మిస్తే బాగుంటుందని వారు భావిస్తున్నారు.

ఈ రోప్ వేలను కనుక నిర్మిస్తే.. విశాఖలో అతి పెద్ద రోప్ వే  నిర్మించనట్లు అవుతుంది. కైలాసగిరి నుంచి డాల్ఫిన్ నోస్ వరకు రోప్ వే అంటే.. దాదాపు 12కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఆర్కే బీచ్ వైపుగా ఏర్పాటు చేశారు. రోప్ లో ప్రయాణిస్తూ.. కింద బీచ్ ని చూసేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపిస్తారు. ఇది కచ్చితంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది..అందువలన దీనిని నిర్మించాలని భావిస్తున్నారు. కాగా.. మరో రోప్ వే కైలాసగిరి నుంచి సింహాచలం వరకు  నిర్మించతలపెట్టినది.. 2కిలో మీటర్ల లోపే ఉంటుంది.

రోప్ వే నిర్మాణ సాధ్యాసాధ్యాలను అహ్మదాబాద్ కి చెందిన కన్సల్టింగ్ ఏజెన్సీ  పర్యవేక్షిస్తోంది. ఈ రిపోర్టు పూర్తి కావడానికి మూడు నెలల సమయం పడుతుంది. ఒకసారి రిపోర్టు పూర్తి అయితే.. స్టేక్ హోల్డర్స్ తో దీనిపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. అన్ని ఒకే అనుకుంటే.. రోప్ వే నిర్మాణం ప్రారంభిస్తారు. ముందుగా కైలాసగిరి నుంచి డాల్ఫిన్ నోస్  వరకు రోప్ వే నిర్మించే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇది కనుక నిర్మిస్తే,.. విశాఖ పర్యాటక రంగం ఆర్థికంగా అభివృద్ధి చెందుతూ.. పర్యాటకులను మరింత ఆకర్షించే అవకాశం ఉంది.

 

 

 

click me!