భర్త మరణ వార్తను లైవ్ న్యూస్ లో చదవాల్సి వచ్చింది

First Published Apr 9, 2017, 8:49 AM IST
Highlights

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐబీసీ-24 ఛానెల్‌ న్యూస్‌ రీడర్ సుప్రీత్‌ కౌర్‌ భరింతచలేనంత బాధాకరమయిన అనుభవం ఎదురయింది. ఇలాంటి  పరిస్థితి ప్రపంచంలో ఎపుడూ ఎక్కడ ఎవరికి వచ్చిఉండదేమో... లైవ్ లో వార్తలు చదువుతున్న ఆమెకు అందించిన ఫీడ్ లో  ఆమె భర్త మరణ వార్త కూడా వచ్చింది. విషయం అర్థమయినా ఆమె  ఎప్పటిలాగే చదివేసింది. ఆతర్వాత వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోవలసి వచ్చింది.

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐబీసీ-24 ఛానెల్‌ న్యూస్‌ రీడర్ సుప్రీత్‌ కౌర్‌ భరింతచలేనంత బాధాకరమయిన అనుభవం ఎదురయింది. ఇలాంటి  పరిస్థితి ప్రపంచంలో ఎపుడూ ఎక్కడ ఎవరికి వచ్చిఉండదేమో... లైవ్ లో వార్తలు చదువుతున్న ఆమెకు అందించిన ఫీడ్ లో  ఆమె భర్త మరణ వార్త కూడా వచ్చింది. అమె  ఎప్పటిలాగే చదవేసింది. ఆతర్వాత వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వెళ్లిపోవలసి వచ్చింది.

ఇది శనివారం నాడు జరిగింది. ఉదయం లైవ్‌లో వార్తలు చదువుతున్నారు. మహసాముండ్‌ జిల్లా పిథారా ప్రాంతంలో జాతీయ రహదారిపై రెనో డస్టర్‌ కారు ప్రమాదానికి గురయింది. గుర్తు తెలియని వాహనమొకటి రెనోని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని,  కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు చనిపోయారని, ఇద్దరికి తీవ్రంగా గాయపడ్డారని రిపోర్టర్‌ ఫోన్ లో వార్త  చెప్పాడు. ఈ వార్త రాగానే చానెల్ న్యూస్ రూంలో కలవరం మొదలయింది. అక్కడందరికి తెలిసిపోయింది జరిగిందేమిటో... అవాక్కయ్యారు. అయితే, ఆవేదనను దిగమింగుకుని గుంభనంగా ఉండిపోయారు సహచరులంతా.

 

ప్రమాదం జరిగిన మార్గంలో ఆమె  భర్త హర్షద్‌ కవాడే కూడా రెనో డస్టర్‌ కారులో వెళ్తున్నాడు. ప్రమాదానికి గరయిన కారు తన భర్తదే నని ఆమెకూ అనుమానం వచ్చింది.

 

అయినా,పెల్లుబుకుతున్న దుఖం అపుకుంటూ వార్తను మామూలుగానే చదివి బులెటిన్‌ పూర్తి చేశారు. బంధువులకు ఫోన్‌ చేసి జరిగిన ప్రమాదం గురించి తెలుసుకుని బోరున విలపించారు.

 

“ ఏమి జరిగిందో మాకు తెలుసు.  ప్రమాదంలో చనిపోయింది ఆమె భర్తయే మాకు తెలుసు. కానీ, ఈ విషయం ఆమెకు చెప్పేందకు దైర్యం చాలలేదు’’ అని ఛానెల్‌ ఎడిటర్‌అన్నారు.

సుప్రీత్‌కు ఏడాది కిందటే వివాహమయింది.

 

 

click me!