నా భార్య చంపేస్తుందంటున్న గంభీర్

Published : Apr 08, 2017, 12:45 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
నా భార్య చంపేస్తుందంటున్న గంభీర్

సారాంశం

ఒక్క డ్యాన్స్ సెప్టు తన కొంప కూల్చేలా ఉందని గౌతీ తెగ భయపడిపోతున్నాడు

బుల్లెట్ లాంటి బాల్స్ కూడా భయపడకుండా బౌండరీ అవతలకు పంపించే గౌతమ్ గంభీర్ తన భార్యకు మాత్రం తెగ భయపడిపోతున్నారు.క్రికెట్ మైదానంలోనే కాదు బయట కూడా ఎప్పుడూ గంభీర్ గంభీరంగానే ఉంటాడు. ఆయన సన్నిహితులు కూడా ఇదే విషయంపై గౌతీని కడిగిపారేస్తుంటారు.

 

సెహ్వాగ్ నుంచి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న ఐపీఎల్ జట్టు యజమాని షారుఖ్ ఖాన్ వరకు అందరూ తెగ పోరు పెడుతున్నా గౌతీ మాత్రం తన ఫేస్ ఫీలింగ్ ను ఏ మాత్రం మార్చడు. నవ్వితే నవరత్నాలు రాలిపోయినట్లు ఎప్పుడూ సీరియస్ లుక్కులే ఇస్తుంటాడు.

 

ఇటీవల ఆయన బావమరిది పెళ్లైంది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో డ్యాన్స్ చేయాలని బంధువులు, చివరకి భార్య పట్టుబట్టిన గంభీర్ కాలు కూడా కదపలేదు. పోనీ లే గౌతీ ఇంతే కదా అని అందరూ సైలెంట్ అయిపోయారు.

 

అప్పట్లో షారుక్ కోరినా గంభీర్ డ్యాన్స్ కు నో చెప్పాడు. అయితే ఈ మధ్య గంభీర్ స్టెప్పులేశాడు. అది కూడా షారుఖ్ అడగకపోయినా ఆయన శ్రీమతి కోరకపోయినా... ఎందుకో తెలుసా... యాడ్ కోసం...

 

అదే ఇప్పుడు గౌతీని భయపెడుతోంది. తన భార్య నటాషా కు ఈ విషయం తెలిస్తే ఇక చంపేస్తుంది అని తెగ హైరానా పడుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !