
హిందీలో బాగా పేరుమోసిన టీ సిరీస్ మ్యూజిక్ కంపెనీ రూపొందించిన ఓ ప్రవైటు పాట పాకిస్తాన్ లో కలకలం రేపుతోంది. దేశంలోని ప్రముఖులంతా ఈ పాట పై రచ్చ రచ్చ చేస్తున్నారు.
పాక్ లోని జల్వా టీవీ చానెల్ టీ సిరీస్ రూపొందించిన ప్రైవేట్ సాంగ్ ‘జహాన్ తుమ్ హో ..’ సాంగ్ ను ఇటీవల ప్రసారం చేసింది. అయితే ఇందులో హీరోయిన్ కురుచ దుస్తులతో ఆశ్లీలంగా ఉండటంతో పాక్ లోని ఓ జర్నలిస్టు దీనిపై దుమ్మెత్తిపోస్తూ ఓ పత్రికలో ఆర్టికల్ రాశాడు. సదరు టీవీ చానెల్ పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటింగ్ అథారిటీ నిబంధలను ఉల్లంఘించిందని విమర్శించాడు. దీనిపై కోర్టు చర్యలు తీసుకోవాలని కోరాడు.
దీనిపై స్వయంగా స్పందించిన పాక్ చీఫ్ జస్టిస్ మెయిన్ సాహిబ్ నిస్సార్ ఆ పాటను ప్రసారం చేసిన టీవీ చానెల్ కు నోటీసులు జారీ చేయాలని పాక్ ప్రసారమంత్రిత్వ శాఖను ఆదేశించాడు. అంతేకాదు తన ట్విటర్ వేదికగా ఆ పాటను ప్రసారం చేసిన టీవీ చానెల్ పై కన్నెర్ర చేశాడు. వెంటనే ఆ చానెల్ ను నిషేధించాలన్నాడు.
పాకిస్తాన్ కు కాకపుట్టించిన ఆ వీడియో సాంగ్ డిసెంబర్ 2016 లో యూట్యూబ్ లో విడుదలైంది. ఇప్పటికే దాదాపు హిట్స్ దాటింది. ఇప్పుడు పాక్ మీడియాలో ఈ సాంగ్ హాట్ టాపిక్ గా మారడంతో మరింతగా హిట్స్ వచ్చిపడుతున్నాయి. ఇదంతా పక్కన పుడితే ఆ సాంగ్ ఏంటో మాకు చెప్పండి అందులోని ఆశ్లీలతను మేము ఖండిస్తామని కొందరు పాక్ కుర్రాళ్లు ట్విటర్ లో తెగ ప్రాధేయపడుతున్నారు.
మీరేమీ ప్రాధేయపడాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ ఇదే...