ఇక ‘ఐప్యాడ్’ లోనూ వాట్సాప్

First Published Nov 14, 2017, 2:11 PM IST
Highlights
  • యాపిల్ ఐప్యాడ్స్ లో వాట్సాప్
  • త్వరలోనే అందుబాటులోకి తెస్తామంటున్న నిర్వాహకులు

ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ గురించి తెలియని వాళ్లు ఉండరు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతిఒక్కరూ వాట్సాప్ వాడుతున్న రోజులివి. ఎన్నో రకాల మెసేజింగ్ యాప్స్ ప్రవేశపెట్టినా.. వాట్సాప్ కు దక్కిన ఆదరణ మరే మెసేజింగ్ యాప్ కి దక్కలేదనే చెప్పొచ్చు. అందులోనూ ప్రతిసారీ ఎదో ఒక కొత్త రకం అప్ డేట్ ని అందుబాటులోకి తీసుకువస్తూ ముందుకు దూసుకువెళ్తోంది. అయితే.. ఇప్పటి వరకు మొబైల్ ఫోన్ లకే పరిమితమైన ఈ వాట్సాప్.. త్వరలో ఐప్యాడ్ లలోనూ దర్శనమివ్వనుంది. మీరు చదివింది నిజమే.. ఐప్యాడ్ లలోనూ వాట్సాప్ వినియోగించుకునే సదుపాయాన్ని తీసుకువస్తున్నారు.

ప్రస్తుతం వాట్సాప్ టెక్నికల్ టీమ్ అదేపనిలో ఉంది. యాపిల్ ఐపాడ్స్ లో వాట్సాప్ ని అందుబాటులోకి తీసుకువస్తున్నామని కంపెనీ నిర్వాహకులు తెలిపారు.దాని తర్వాత ట్యాబ్‌ కోసం కూడా ఓ వెర్షన్‌ రూపొందించే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే కనక జరిగితే ఇక వాట్సాప్‌ మరింత మందికి చేరుతుంది. ప్రస్తుతం యాప్‌లో చేస్తున్న చిన్న చిన్న మార్పులు ఈ ఐప్యాడ్‌ వెర్షన్‌ను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారని సమాచారం. తొలుత వాట్సాప్‌ వాడాలంటే మొబైల్స్ లోనే వీలయ్యేది. వాట్సాప్ వెబ్ వచ్చిన తర్వాత కంప్యూటర్ లలోనూ వాడేస్తున్నారు.

click me!