మహిళలు మసాజ్ చేస్తే తప్పేంటి?

Published : Oct 13, 2017, 06:18 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
మహిళలు మసాజ్ చేస్తే తప్పేంటి?

సారాంశం

మసాజ్ పార్లర్ లలో పురుషులకు మహిళలు మసాజ్ చేయకూడదని  ఏ చట్టం చెప్పింది? ఒక వేళ నిజంగా ఆ మసాజ్ సెంటర్ లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లైయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కానీ.. లైసెన్స్ రద్దు చేస్తారా అంటూ న్యాయ స్థానం ప్రశ్నించింది.

మసాజ్ పార్లర్ లలో పురుషులకు మహిళలు మసాజ్ చేయకూడదని  ఏ చట్టం చెప్పింది? అంటూ కర్ణాటక హైకోర్టు మంగళూరు కార్పొరేషన్ ని ప్రశ్నించింది. బెంగళూరులోని ఆయుర్వేద, పంచకర్మ థెరపీల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ  మసాజ్ సెంటర్ లైసెన్స్ లను మంగళూరు కార్పొరేషన్ రద్దు చేసింది. దీనిపై మసాజ్ సెంటర్ యజమానులు కోర్టును ఆశ్రయించారు.

మసాజ్ సెంటర్ యజమానులు పెట్టుకున్న కేసు గత బుధవారం హియరింగ్ కి వచ్చింది. కేసును పరిశీలించిన న్యాయస్థానం కార్పొరేషన్ ని పైవిధంగా ప్రశ్నించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా లైసెన్స్ ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించింది. ఒక వేళ నిజంగా ఆ మసాజ్ సెంటర్ లలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లైయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కానీ.. లైసెన్స్ రద్దు చేస్తారా అంటూ న్యాయ స్థానం అడిగింది.

ముందుగా ఆ మసాజ్ సెంటర్ యజమానులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని.. అప్పటికీ వారు స్పందించకపోయినా.. సరైన సమాధానం ఇవ్వకపోతే అప్పుడు చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం సూచించింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !