అక్కడ మూడు గంటలు టపాసులు కాల్చుకోవచ్చు..

First Published Oct 13, 2017, 5:58 PM IST
Highlights
  • దీపావళి రోజున మూడు గంటలు మాత్రం టపాసులు కాల్చుకునే అవకాశం కల్పించింది.
  • అంటే ఆరోజు సాయంత్రం 6గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9గంటల 30 నిమిషాల వరకు బాణా సంచా కాల్చుకోవచ్చు.

దీపావళి పండుగ నాడు టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తూ.. ఇప్పటికే దిల్లీ, ముంబయి హైకోర్టులు తీర్పు వెలువరించాయి. న్యాయస్థానాల తీర్పును కొందరు స్వాగతిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల న్యాయస్థానాలు కూడా ఇదే విషయంపై ఈ రోజు తీర్పు వెలువరించాయి.

కాకపోతే.. ఆ రాష్ట్రాల్లో టపాసులు కాల్చడాన్ని పూర్తిగా నిషేధించలేదు. దీపావళి రోజున మూడు గంటలు మాత్రం టపాసులు కాల్చుకునే అవకాశం కల్పించింది. అంటే ఆరోజు సాయంత్రం 6గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 9గంటల 30 నిమిషాల వరకు బాణా సంచా కాల్చుకోవచ్చు.

ఆ సమయం దాటి టపాసులు కాలిస్తే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందిగా.. న్యాయస్థానం పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా టపాసులు అమ్మేవారికి శాశ్వత లైసెన్స్ ఇవ్వడం కుదరదని చెప్పింది. పేలుళ్ల చట్టం కింద...  ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన న్యాయస్థానం... కేవలం టెంపరీ లైసెన్స్ మాత్రమే జారీ చేయాలని చెప్పింది.

దేశరాజధాని దిల్లీలో మాత్రం నవంబర్ 1వ తేదీ వరకు టపాసులు కాల్చకూడదని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే తీర్పు వెలువరించింది.

click me!