శబరిమల మహిళల కేసు కోసం రాజ్యాంగ ధర్మాసనం

Published : Oct 13, 2017, 05:11 PM ISTUpdated : Mar 25, 2018, 11:42 PM IST
శబరిమల మహిళల కేసు కోసం రాజ్యాంగ ధర్మాసనం

సారాంశం

2007లో కేరళ ప్రభుత్వం.. శబరిమల ఆయంలోకి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వెళ్లవచ్చని.. అందులో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించింది.

శబరిమల ఆలయంలోకి మహిళలను ప్రవేశించాలా, వద్దా అనే విషయాన్ని తేల్చే బాధ్యత సుప్రీం కోర్టు ...రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో గల త్రిసభ్య బెంచ్.. శుక్రవారం ఈ కేసును రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ధర్మాసనానికి బదిలీ చేసే సమయంలో ఈ విషయంపై కొన్ని ప్రశ్నలను కూడా ఫ్రేమ్ చేసింది.

త్రిసభ్య బెంచ్.. ధర్మాసనం ముందు ఉంచిన ప్రశ్నలు..

1. ఆలయంలోకి మహిళలను రాకుండా నిషేధం విధించవచ్చా?

2. ఆయంలోకి మహిళలను రాకుండా నిషేధించడం వారి హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందా?

3. పది సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలలోపు మహిళలను ఆలయంలోనికి అనుమతించకపోవడం వివక్ష కిందకు వస్తుందా?

అనే ప్రశ్నలను న్యాయస్థానం రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంచింది.

2007లో కేరళ ప్రభుత్వం.. శబరిమల ఆయంలోకి వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా వెళ్లవచ్చని.. అందులో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ప్రకటించింది. ఆ సమయంలో కొందరు మహిళలు ఆయంలో కి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు కూడా. అయితే.. ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్(  యూనైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్) వ్యతిరేకించింది. దీనిపై ఇప్పటికీ వివాదం నడుస్తూనే ఉంది. దీంతో ఈ కేసు న్యాయస్థానం ముందుకు వచ్చింది.

దీంతో ఈ కేసును పరిశీలించిన న్యాయస్థానం శుక్రవారం రాజ్యాంగ ధర్మాసనం ముందు  ఈ కేసును ఉంచింది. ఆలయం నిర్మించిన నాటి నుంచి 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలను ఆయంలోకి ప్రవేశించకుండా షరతులు విధించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !