ఆయ‌న‌ను తెర‌పై చూడాలంటే రెండు లైట్స్ ఎక్కువ కావాల‌ట‌

Published : Aug 05, 2017, 12:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
ఆయ‌న‌ను తెర‌పై చూడాలంటే రెండు లైట్స్ ఎక్కువ కావాల‌ట‌

సారాంశం

నన్ను రంగు తక్కువ అని తిరస్కరించారు. గుర్తు చేసుకున్నా నవాజుద్దిన్ సిద్దీఖీ త్వరలో ఆయన నటించిన 'బాబామోయిష బందూబాజ్' సినిమా విడుదల.

న‌వాజూద్దీన్ సిద్దీఖీ త‌న పై తాను సెటైర్లు వేసుకున్నారు. త‌న‌ నూత‌న చిత్రం ‌బాబామోయిష బందూబాజ్ ప్రచారంలో భాగంగా ఆయన తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. సినిమాల్లో క్యారెక్టర్ కోసం ప్రయత్నిస్తున్న కాలంలో సిద్దీఖీ 6 సంవత్సరాల పాటు ముంబాయిలో ఉన్న అన్ని స్టూడియోల‌ చుట్టు తిరిగారట, కానీ చిన్న క్యారెక్ట‌ర్ కూడా దొర‌క‌లేద‌ట‌. దానికి కార‌ణం కోసం ఒక రోజు ఒక డైరెక్ట‌ర్ ని ప్ర‌శ్నిస్తు ఇలా చెప్పార‌ట‌. నువ్వు చాలా న‌ల్ల‌గా ఉన్నావు. న‌టుడిగా చాలా క‌ష్టం అన్నార‌ట‌.


ఆ రోజు డైరెక్ట‌ర్ అన్న మాట‌ల‌కు న‌వాజూద్దీన్ సిద్దీఖీ నేడు గుర్తు చేసుకున్నారు. నన్నున‌టుడిగా తీసుకుంటే రెండు లైట్స్ ఎక్కువ పెట్టి ఫోక‌స్ పెంచాల్సి వ‌స్తుంది అని డైరెక్ట‌ర్ అన్న‌ట్లు సిద్దీఖీ తెలిపారు. తిరిగి డైరెక్ట‌ర్ ని ప్ర‌శ్నించ‌లేక‌పోయాన‌ని, తాను డైరెక్ట‌ర్ ని తిరిగి అడిగే స్థాయిలో  లేన‌ని ఆయ‌న పెర్కోన్నారు. న‌ట‌న‌కి శ‌రీర రంగు ప్రామాణికం కాద‌ని తెలిపారు. క‌ల‌ర్ త‌క్కువున్నా ప్ర‌పంచంలో చాలా మంది మంచి న‌టులు ఉన్నార‌ని ఆయ‌న ఈ సందర్భంగా పెర్కొన్నారు.

  న‌వాజూద్దీన్ సిద్దీఖీ బాలీవుడ్ లో క్యారెక్ట‌ర్ ఆర్టీస్ట్ నుండి హీరో స్థాయికి ఎదిన న‌టుడు. చాలా సినిమాల్లో సిద్దీఖీ విల‌న్ రోల్స్ బాగా పండించారు. మంజీ - ది మౌంటైన్ మాన్ సినిమాతో త‌న‌లోని న‌టుడిని ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు. ఆయ‌న న‌టించిన బాబామోయిష బందూబాజ్ సినిమా ఆగ‌ష్టు 21వ తేదీన విడుద‌ల అవ్వాల్సి ఉంది. సెన్సార్ బోర్డు 48 క‌ట్స్ విధించ‌డం బాలీవుడ్ లో చ‌ర్చ‌నీయాంశం అయింది.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !