ఇక సైన్యానికి ఖాదీ యూనిఫాం

Published : Aug 05, 2017, 11:30 AM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
ఇక సైన్యానికి ఖాదీ యూనిఫాం

సారాంశం

ఎన్డీయే ప్రభుత్వం ఒక కీలమయిన చర్య తీసుకుంటున్నది రాజకీయాలకే పరిమితమయిన ఖాదీని సైన్యం దాకా తీసుకుపోయేందుకు ప్రభుత్వం నిర్ణయించింది

 

ఖాదీని భారతీయత చిహ్నంగా మార్చేందుకు ప్రధాని మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక కీలమయిన చర్య తీసుకుంటున్నది., ఇంతవరకు రాజకీయాలకే పరిమితమయిన ఖాదీని సైన్యం దాకా తీసుకుపోయేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇక  సైనికులకు కూడా  ఖాదీ  యూనిఫాం తయారవుతుంది.  ఈ మేరకు ప్రభుత్వం ఒక విధాన పర నిర్ణయం  నిర్ణయం తీసుకుంది. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారంలో కనీసం ఒక రోజు ఖాదీ దుస్తులను  ధరించాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు సైనికులకు కూడా ఈ నియమాన్ని అమలు చేయబోతున్నారు.

ఈ విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ బ్రమే లోక్ సభలో తెలియజేశారు. ఈ మేరకు సైనికులకు ఖాదీ దస్తులు తయారు చేయాల్సిందిగా ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ను కోరినట్లు ఆయన చెప్పారు. సైనికులకు సూట్ అయ్యేలా.. వారికి సౌకర్యవంతంగా ఉండేలా వాటిని తయారు చేయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.వివిధ రకాల సందర్భాలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారికి యూనిఫాం తయారు చేయిస్తున్నామన్నారు.

PREV
click me!

Recommended Stories

ఈ పోర్న్ స్టార్ కొత్త బిజినెస్ షురూ చేసింది
ఈ మంత్రిగారు మహారసికులు !