శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో అలౌట్

Published : Aug 05, 2017, 12:05 PM ISTUpdated : Mar 25, 2018, 11:52 PM IST
శ్రీలంక మొదటి ఇన్నింగ్స్ లో అలౌట్

సారాంశం

ఐదు వికెట్లతో రాణించిన అశ్విన్ జడేజా, షమీ తలా రెండు వికెట్లు 183 పరుగులకు అలౌట్.

కొలంబో టెస్టులో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ముగిసింది. టీమిడియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో లంకేయులు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. తరంగ (0), కరుణ రత్నె (25) వికెట్లు కోల్పోయి ఓవర్ నైట్ స్కోరు 50 తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక జట్టులో డిక్ వెల్లా (51) అర్థ సెంచరీతో రాణించగా, మాథ్యూస్ (26) దిల్ రువాన్ (25), మెండిస్ (24) ఫర్వాలేదనిపించారు. చండిమాల్ (10), డిసిల్వా (0), హెరాత్ (2), ఫెర్నాండో (0) విఫలమయ్యారు. దీంతో కేవలం 183 పరుగులకే శ్రీలంక అవుటైంది. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ ఐదు వికెట్లతో రాణించగా, జడేజా 2 వికెట్లతో సత్తాచాటాడు. షమి కూడా రెండు వికెట్లతో ఆకట్టుకోగా, ఉమేష్ యాదవ్ ఒక వికెట్ తీశాడు. దీంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 439 పరుగులు వెనుకబడి ఉంది. లంచ్ విరామం తరువాత భారత్ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభిస్తుంది. 

PREV
click me!

Recommended Stories

ఏపీ హైకోర్టులో మహిళా జడ్జి ప్రమాణ స్వీకారం | Justice Leesa Gill appointment | Asianet News Telugu
Iran Israel War: తెలుగు రాష్ట్రాల్లో గుడ్ల ధరలు ఎంతో తెలుసా? | Eggs, Chicken Price | Asianet Telugu