భూ కబ్జా కేసులో నారా లోకేష్... సీబీఐకి వైసీపీ ఫిర్యాదు

First Published May 23, 2017, 3:20 PM IST
Highlights

అన్యాక్రాంతం అవుతున్న రూ.1500 కోట్ల ప్రభుత్వ భూమిలో లోకేష్ హస్తం ఉందని ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై  వైసీపీ నేతలు సీబీఐకే ఫిర్యాదు చేశారు.

 

విశాఖ నగరంలోని దసపల్లా హిల్స్ భూ కుంభకోణంలో ఆయన ప్రమేయం ఉందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

అన్యాక్రాంతం అవుతున్న రూ.1500 కోట్ల ప్రభుత్వ భూమిలో లోకేష్ హస్తం ఉందని ఆరోపించారు.

 

దసపల్లా హిల్స్ లోని సర్వే నెంబర్లు 1196, 1197, 1026, 1027 స్థలాన్ని రెవెన్యూ  భూములని గతంలో కలెక్టర్ గెజిట్ నోటిఫికేన్ జారీ చేశారని,

 

అయితే ఆయన వెళ్లిపోయాక ఆ భూములపై 50 మంది కోర్టుకు వెళ్లారని అయితే ఆ భూములు తమవేనని చెబుతన్న కురుపాం రాజవంశస్తులు అక్కడ టీడీపీ భవనం నిర్మిస్తున్నారని పేర్కొన్నారు.

 

కురుపాం రాజవంశస్థులు లోకేష్ కు బినామీలుగా ఉన్నారని ఆరోపించారు.

 

ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాల ఆధారంగానే లోకేష్ పై తాము సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు వైసీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.

 

ఈ అంశంపై సరిగ్గా స్పందిచకపోతే హైకోర్టుకు కూడా వెళ్తామన్నారు.

click me!